ఈ మాటలు అంటుంది ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు, రాజకీయ వేత్త వివేక్ ఒబెరాయ్.   రాంగోల్ వర్మ దర్శకత్వం వహించిన ‘రక్త చరిత్ర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ మద్య సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడికి ప్రచారంలో కూడా బాగా సహకరించారు. అంతే కాదు రక్త చరిత్ర సినిమా తర్వాత పరిటాల కుటుంబ సభ్యులతో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో  అనంతపురం జిల్లాలోని ముత్తవకుంట్లను దత్తత తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

తనను సొంత కుటుంబ సభ్యుడిగా పరిటాల సునీత, శ్రీరామ్ చూసుకుంటారని ఓ సందర్భంలో తెలిపారు.  వివేక్ ఒబెరాయ్ మెగాస్టార్ చిరంజీవిని తెగ పొగిడేస్తున్నాడు.. చిరంజీవి నటుడిగా మెగాస్టారే కాదు ఆయన మనసు కూడా మెగాస్టారేనని అన్నారు. తాను హైదరాబాదు వచ్చినప్పుడు ఆయన స్వయంగా ఇంటికి ఆహ్వానించి, వంట చేసి, భోజనం పెట్టారని వివేక్ ఒబెరాయ్ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నాడు.

చిరంజీవితో వివేక్ ఒబెరాయ్,ప్రియాంక అల్వా


వాస్తవానికి హైదరాబాద్ తనకు పుట్టినిల్లని ఇక్కడికి వస్తే చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు. తన తండ్రికి, తనకు ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారని అన్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో  మహేశ్ బాబు, రాంచరణ్, రానా తదితరులు తనకు మంచి మిత్రులని వివేక్ ఒబెరాయ్ అన్నారు. ‘రక్త చరిత్ర’ సినిమా తర్వాత తనను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని దీనికి ఎంతో కృతజ్ఞతలు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: