హర్రర్ జొనెర్ లో సూపర్ హిట్ లు పడుతున్న సీజన్ ఇది. డబ్బింగ్ అయినా స్ట్రెయిట్ సినిమా అయినా సూపర్ సక్సెస్ లు హర్రర్ తో ఈజీ గా వచ్చేస్తున్నాయి. అరుంధతి తో మొదలైన ఈ హర్రర్ గోల ఎక్కడెక్కడికో వెళ్ళిపోతోంది. ముని, గంగ, కాంచన, పిశాచి, ఇలా ఒకటా రెండా ఎన్నో సినిమాలు ఈ జొనెర్ లో అదుర్స్ అనిపిస్తున్నాయి. దయ్యం స్టోరీ లతో కథ రాసుకోవడం దాన్ని చక్కగా ఎగ్జిక్యూట్ చెయ్యడం లాంటివి ఇందులో ఆసక్తికర విషయాలు.

 

 

 

ఈ వారం కళావతి అనే మరొక హర్రర్ డబ్బింగ్ సినిమా విడుదల అవుతోంది, దానికి ప్రీమియర్ గా నిన్న రాత్రి కొందరు ప్రముఖులు చూసారు ఆ సినిమా చూసిన వారు బీ , సి సెంటర్ లలో ఈ సినిమా ఊపేస్తుంది అంటున్నారు. ఈ రేంజ్ లో సినిమా ఉంటుంది అని అసలు ఊహించనే లేదు అట.

 

 

 

చాలా మంది పెద్దోళ్ళు రైట్స్ తీసుకుంటే పోయేది కదా అనుకుంటూ ఉన్నారట. ఇప్పటికిప్పుడు డబ్బు కట్టని పార్టీల దగ్గర తాము కట్టేసి మరీ తీసుకుందాం అని వెతికేస్తున్నారు మరికొంతమంది. ఈ రకంగా కళావతి సినిమా కి విడుదల ముందరే మంచి టాక్ వచ్చేసింది అంటున్నారు. చూద్దాం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం రచ్చ చేస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: