టాలీవుడ్లో సూపర్ క్రేజ్ సంపాధించి కుర్ర కారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన సుందరి టబు.. అందం అభినయంతో పాటుగా రెచ్చగొట్టే సోయగాలు అప్పటి యూత్ కు పిచ్చేక్కేలా చేసింది. ప్రస్తుతం ఫేడవుట్ అయిన ఈ భామ ఇక్కడ స్టార్ స్టేటస్ రాగానే వెంటనే ముంబై చెక్కేసింది. ఇక అక్కడ కూడా తన మార్క్ నటనతో కేక పెట్టించింది. బాలీవుడ్ ఆడియెన్స్ లో కూడా టబుకి ఓ సెపరేట్ ఇమేజ్ ఉంది.


అయితే దశాబ్ద కాలంగా సూపర్ ఫాంలో ఉన్న ఈ భామ ప్రస్తుతం సెలెక్టెడ్ సినిమాలను చేస్తూ కాలం వెళ్లదీస్తుంది. ప్రస్తుతం ఫితూర్ సినిమాలో నటిస్తున్న టబు తనకు మళ్లీ గోవిందాతో నటించాలని ఉందని చెప్పింది. తనతో చేయడం చాలా సరదాగా ఉంటుందని.. గోవిందా ఓ అద్భుతమైన కో స్టార్ అని అంటుంది. గోవిందా, టబులది సూపర్ కాంబినేషన్.


వారు నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్స్ అందుకున్నాయి. డేవిడ్ ధావన్ డైరక్షన్లో గోవిందా, టబుల సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందినవి. అంతేకాదు టబు నటనా ప్రాధాన్యత సినిమాల్లో ఎలా నటించిందో.. హాట్ సినిమాల్లో కూడా అంతే న్యాయం చేసింది. కేవలం టబు అందాలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ బ్యాచిలర్ గా ఉన్న ఈ భామ ఎటువంటి హాట్ సినిమాలోనైనా నటించేందుకు సిద్ధం అంటుంది.


మరి టబు కోరుకున్నట్టుగా గోవిందా తనతో నటించడానికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ప్రస్తుతం ఫితూర్ సినిమా కత్రినా కైఫ్, ఆదిత్యా రాయ్ కపూర్ లీడ్ రోల్స్ చేస్తుండగా.. అభిషేక్ కపూర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ట్రైలర్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కత్రినా ఈ సినిమాలో హాట్ బెడ్ సీన్ కూడా ఉందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: