దక్షిణాది సినిమా రంగ టాప్ హీరోయిన్ గా ఈరోజు ప్రముఖ స్థానంలో వెలిగిపోతున్న శ్రుతిహాసన్ అబ్బాయిల పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన దగ్గరకు రకరకాల వ్యవహారాల నిమిత్తం వచ్చే అబ్బాయిలను వారి బాడీ లాంగ్వేజ్ ను బట్టి అంచనా వేస్తాను అని కామెంట్ చేసింది శ్రుతి హాసన్. ముందుగా తన వద్దకు వచ్చే పురుషుల కళ్ళను చూస్తాను అని ఆ తరువాత అతడు తన వైపు చూసే కంటి చూపు బట్టి ఆ వ్యక్తి పై ఒక అవగాహనకు వస్తాను అని కామెంట్ చేసింది శ్రుతిహాసన్.

అంతేకాదు తనకు ప్రతిరోజు కనిపించే అనేకమంది పురుషులను అంచనా వేయడానికి తాను వారి చేతి గోళ్ళను చూస్తాను అని మగవాళ్ళు గోళ్ళు కొరుక్కుంటూ కనిపించ కూడదని తన బలమైన నమ్మకం అని అంటూ అయితే ఈ అభిప్రాయాలు తనకు ఎందుకు కలిగాయో తనకే తెలియదు అంటూ తన పై తానే సెటైర్లు వేసుకుంది శ్రుతి. 

ఇదే సందర్భంలో తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ తాను ఈ రెండు లక్షణాలు ఉన్న వ్యక్తులను తన భర్తగా అంగీకరించలేనని అయితే తనను పెళ్ళి చేసుకునే వాడు రాక్ స్టార్ కాకపోయినా మంచి మనసు ఉండి తనను అర్ధం చేసుకోవాలని కండిషన్స్ పెడుతోంది శ్రుతిహాసన్. అయితే అటువంటి వ్యక్తి ఎప్పుడు దొరుకుతాడో తనకు తెలియదు అంటోంది శ్రుతి హాసన్.

ఆశ్చర్యకరమైన శ్రుతి హాసన్ కామెంట్స్ ను బట్టి ఆమెతో నటించే హీరోలు కూడ తమ చూపుల విషయంలో అలాగే తమ చేతి వెళ్ళ గోళ్ళ విషయంలో రానున్న రోజుల్లో శ్రుతి హాసన్ చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: