అక్కినేని కుటుంబ హీరోలు అంతా చాల తెలివిగా ఉంటూఉంటారు అన్నది ఓపెన్ సీక్రెట్. అందువల్ల ఈ కుటుంబ హీరోల వద్ద పనిచేసే పర్సనల్ స్టాఫ్ చాల జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. అయినా నాగచైతన్య దగ్గర పనిచేసే ఒక అసిస్టెంట్ చైతూను మోసం చేయబోయి తనకు తానే నష్టపోయిన ఒక సంఘటనకు సంబంధించిన న్యూస్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. 

ఈ న్యూస్ లో ఎన్ని వాస్తవాలో తెలియకపోయినా  అక్కినేని కుటుంబ హీరోలు ఎంత తెలివిగా ఉంటారో అన్న విషయానికి అద్దం పడుతోంది. యూత్ లో నాగచైతన్యకు ఇంత క్రేజ్ ఉందా అనే ఆశ్చర్యాన్ని కూడ ఈ సంఘటన కలిగిస్తోంది. నాగచైతన్య ప్రస్తుతం మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ‘ప్రేమమ్‌’ ను తెలుగులో ‘మజ్నూ’ గా రీమేక్ చేస్తున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కొద్ది రోజుల క్రితం వైజాగ్ లోని ఒక ప్రముఖ కాలేజీలో షూటింగ్ జరుపుకున్న నేపధ్యంలో ఆ కళాశాల అనుమతి కోసం ప్రిన్స్ పాల్ ను కలిసిన చైతన్య అసిస్టెంట్ ను తమ కాలేజీ విద్యార్ధులు చైతూతో ఫొటోలు దిగాలని అదేవిధంగా కొoతసేపు చైతన్యతో మాట్లాడాలని తన కాలేజీ విద్యార్ధులు అడుగుతున్న కోరికను నాగచైతన్య అసిస్టెంట్ దృష్టికి తీసుకు వచ్చాడట. 

అయితే చైతన్య అసిస్టెంట్ దీనికి కొన్ని లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడట. అయితే ఈ విషయాన్ని ఆ కాలేజీ ప్రిన్స్ పాల్ డైరెక్ట్ గా చైతూకు చేరవేయడంతో షాక్ అయిన నాగచైతన్య తన వ్యక్తిగత అసిస్టెంట్ ను ఉద్యోగం నుండి తీసివేసినట్లు ఫిలింనగర్ టాక్. ఈ అసిస్టెంట్ తనకు చైతన్య దగ్గర ఉన్న సాన్నిహిత్యంతో అన్నపూర్ణ స్టూడియోస్‌లో కూడ హవా సాగించేవాడని రూమర్స్ ఉన్నాయి. అయితే ఇటువంటి వ్యక్తులను ఎందరినో చూసిన అక్కినేని కుటుంబంతో ఇటువంటి వ్యవహారాలు సాగవు అనే విషయం మరోసారి రుజువైంది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: