హీరో సునీల్ ఈవారం విడుదల కాబోతున్న తన ‘కృష్ణాష్టమి’ పై చాల భారీ అంచనాలు పెట్టుకోవడమే కాకుండా ఈసినిమా ప్రమోషన్ కోసం రంగంలోకి దిగాడు. తాను హీరోగా ఏమైనా చేస్తా కానీ హీరోయిన్  తో రొమాన్స్ మాత్రం తనవల్ల కాదు అంటూ తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు. తాను హీరోగా మారాక డ్యాన్సులు ఫైట్లు ఇలా ఏ విషయంలోను ఇబ్బంది పడని తాను ఒక్క రొమాన్స్ విషయంలో మాత్రం వీక్ అంటూ తన పై తానే కామెంట్స్ విసురుకున్నాడు. 

ఈసందర్భంలో ఒక ఆశక్తికర విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తాను గతంలో రాజమౌళిదర్శకత్వంలో ‘మర్యాదరామన్న’ సినిమా చేస్తున్నప్పుడు ఆసినిమా హీరోయిన్ సలోనికి ముద్దుపెట్టే సీన్ లో తెగ ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తుకుచేసుకుంటూ ఆసీన్ కు తాను రాజమౌళి చెప్పిన విధంగా నటించలేక ఎన్ని టేక్స్ తీసుకున్నానో తనకే లెక్కలేదు అంటూ తాను రొమాన్స్ లో ఎంత వీక్ అన్న విషయాన్ని బయట పెట్టాడు సునీల్. 

అంతేకాదు తాను బాలీవుడ్ హీరో గోవిందాలా డాన్స్ లో ఫాస్ట్ రొమాన్స్ లో వీక్ అంటూ సెటైర్లు వేసుకున్నాడు. ఇదిఇలా ఉండగా యాక్షన్ హీరోలా మారి అందరికీ షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న సునీల్ ఈసినిమాలో ఒక రిస్కీ షాట్ చేసినట్లుగా చెపుతున్నాడు. ‘కృష్ణాష్టమి’ సినిమా కోసం ఒక సీన్ లో కారును రివర్స్ లో వేగంగా మూడు నుంచి మూడున్నర నిమషాలు డ్రయివ్ చేసాడట సునీల్. 

అయితే ఈసీన్ చిత్రీకరించే లొకేషన్ పక్కన ఒక పెద్ద కొండ మరొక పక్క లోతైన లోయ మధ్య సన్నటి రోడ్డు పై రిస్క్ చేస్తూ తాను చేసిన ఆరిస్కీ షాట్ తలుచుకుంటే తనకు ఇప్పటికీ చెమటలు పడుతున్నాయని అంటూ ఈసినిమా కోసం తాను పడ్డ కష్టాన్ని వివరించాడు సునీల్. మరొక ట్విస్ట్ ఏమిటంటే ఈసినిమాలో కూడ సునీల్ సిక్స్‌ ప్యాక్‌ ను చూపించబోతున్నట్లు వెల్లడించాడు సునీల్‌. కేవలం మూడు నాలుగు సెకండ్స్  మాత్రమే కనిపించే ఈసీన్ కోసం తాను మూడునెలలు కష్టపడ్డాను అని అంటున్నాడు ఈభీమవరం బుల్లోడు. ‘కృష్ణాష్టమి’ విజయంలో ఏమాత్రం తేడాలు వచ్చినా సునీల్ కెరియర్ మరింత ప్రమాదకరంగా మారేఅవకాశం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: