టాలీవుడ్ కొంతమందికి మంచి అవకాశాలను ఇచ్చినా మరికొంతమందికి మాత్రం ఎప్పుడు చేదు అనుభవాలను ఇస్తూ వచ్చింది. ఇక కొంతమంది హీరోయిన్స్ కి అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐరన్ లెగ్ అనే ముద్ర పడేలా చేసింది. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే అందాల భామ కృతి కర్భందా వస్తుంది. చేయడానికి డజను సినిమాల దాకా చేసినా అమ్మడు నటించిన ఏ సినిమా తెలుగులో హిట్ కాలేదు.


బోణి సినిమాతో బోణి కొడుతుంది అనుకున్న ఈ భామ తెలుగులో ఒక్క సూపర్ హిట్ బోణి చేయకపోవడం విశేషం. అందుకే ఇక్కడ ఎలాగు లక్ కలిసి రావట్లేదని కన్నడ పరిశ్రమకు జంప్ అయ్యింది. చేసిన రెండు మూడు సినిమాలు అక్కడ పర్వాలేదనిపించుకుని చిన్నగా తమిళ పరిశ్రమలో కూడా క్రేజ్ సంపాధిచింది ఈ బ్యూటీ. అయితే సాధారణంగా హీరోయిన్స్ అన్న తర్వాత ఏదో ఒక సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు.   


ఇప్పుడు వారి దారిలో కృతి కూడా ఓ మూవింగ్ హోటెల్ స్టార్ట్ చేసిందట. 'మీల్స్ ఆన్ వీల్స్' అనే హోటల్ ను ప్రెజెంట్ చేస్తుంది కృతి కర్భందా.. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యక్రమాలన్ని పూర్తి చేసిందట. స్మాల్ బిజినెస్ లా కనబడుతున్నా అమ్మడు దీన్నే పెద్దదిగా చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాల్లో మంచి ఫాంలో ఉన్న కృతి వరుసెంట సినిమాలను చేసేస్తుంది. 


ఇక తను పెట్టిన ఈ స్మాల్ బిజినెస్ కూడా సూపర్బ్ గా క్లిక్ అయితే మాత్రం దాన్ని ఎస్టాబ్లిష్ చేసే పని మొదలుపెడుతుంది. సాటి హీరోయిన్స్ లా తానో క్లాత్ స్టోరో.. రెస్టారెంటో పెట్టకుండా అందరు ఆలోచించే విధంగా మీల్స్ ఆన్ వీల్స్ పెట్టి తన గొప్పతనం చాటుకుంది కృతి కర్భందా మరి అమ్మడికి ఇది ఏ విధంగా లాభాలను తెచ్చిపెడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: