ఎన్.టి.ఆర్.. తాతకు తగ్గ మనవడిగా నటనలో విభిన్న కోణాలను చూపిస్తూ ఓ రెంజ్ కి వెళ్లిన నందమూరి వారసుడు. అయితే తారక్ రేంజ్ ఏంటో ఆయన ఎలాంటి హిట్లు కొట్టగలడో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. కెరియర్ స్టార్టింగ్ లోనే ఆది, సింహాద్రి అంటూ ప్రభంజనాలు సృష్టించిన తారక్ మధ్యలో కాస్త స్లో అయినట్టు కనిపించినా ఇప్పుడు మళ్లీ రేసుగుర్రంలా దూసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు.   


కొద్దికాలంగా ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తున్న తారక్ ఎట్టకేలకు టెంపర్ తో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. టెంపర్ లో ఆయన నటనకు ప్రేక్షకులు కూడా మంత్ర ముగ్ధులయ్యారు. అయితే ఇక తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతోతో మరో ఎత్తుకి ఎదిగాడు తారక్. తనలో ఉన్న రొటీన్ ఫార్ములాను మానేసి కొత్త ప్రయత్నాలు చేయడానికి ఎన్నో మార్పులు చేర్పులతో తనని తాను మార్చుకున్నాడు ఎన్.టి.అర్. 


ఇక ఎన్నాళ్ల నుండో ఊరిస్తున్న 50 కోట్ల ఆశ కూడా నాన్నకు ప్రేమతో రీచ్ అయ్యేలా చేసింది. అయితే తారక్ వ్యూహ రచన వేరేగా ఉంది. అసలు 50 కోట్లు కాదు 100 కోట్ల మార్కెట్ తన సినిమా మీద జరిగేలా టాలీవుడ్ బాద్షా అనిపించేలా అడుగులు వేస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారక్ తలచుకుంటే ఆ ఫీట్ సాధ్యం కానిది కాదు. అందుకే ఇదవరకులా కాకుండా కథలను తానే స్వయంగా డైజెస్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నాడు.


అంతేకాదు టాలీవుడ్ టాప్ హీరోగా చెలామని అవుతున్న ఇద్దరు ముగ్గురు స్టార్లకు త్వరలో తారక్ షాక్ ఇస్తాడనే అంటున్నారు. ఇప్పటికే ఓ సెంటిమెంట్ సినిమాను సూపర్ హిట్ చేసుకున్న తారక్ పక్క మాస్ సినిమాతో వస్తే 100 కోట్లు ఈజీ అన్న మాట వినిపిస్తుంది. తనకు ఆ సత్తా కూడా ఉందన్న విషయం అందరికి తెలుసు మరి అది ఎంత త్వరగా ఏ సినిమాతో సాధిస్తాడో అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: