మంచి విలక్షణ నటుడుగా పేరు గాంచిన అల్లరి నరేష్ ఇప్పటి వరకు 50 సినిమాలలో నటించి టాలీవుడ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నా గత 3సంవత్సరాలుగా అతడిని వెంటాడుతున్న పరాజయాలతో సతమతమైపోతున్నాడు ఈ అల్లరోడు.

అల్లరి నరేష్ కేవలం కామెడీ హీరోగా మాత్రమే పేరు తెచ్చుకున్నా అతడు ఎటువంటి పాత్రలని అయినా చేయగలడు అనే పేరు ఉంది. గతంలో నరేష్  తన సినిమాలకు సంబంధించి కొన్ని ప్రయోగాలు కూడ చేసాడు. కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణవంశీ వంటి డ్యాషింగ్ డైరక్టర్ తో ‘డేంజర్' వంటి సినిమా చేసినా ఆ సినిమా కూడా నరేష్ కు ఎందుకో కలిసిరాలేదు. అయితే యాక్షన్ హీరో మారాలని ఈ అల్లరోడికి ఎప్పటి నుంచో కోరిక ఉందట.
 
ఇప్పుడు ఆ కోరికను దర్శకుడు పూరి జగన్నాథ్ తీర్చబోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పూరి కళ్యాణ్ రామ్ తో సినిమా చేసిన తరువాత మహేష్ సినిమాను మొదలు పెట్టడానికి గ్యాప్ ఉండే నేపధ్యంలో మధ్యలో అల్లరి నరేష్ ను  యాక్షన్ హీరోగా మార్చడానికి పూరి ఒక పవర్ ఫుల్ కథ తయారు చేస్తున్నట్లు టాక్. 

ఈ వార్తలు ఇలా ఉండగా ప్రస్తుతం ఈ కామెడీ హీరో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ లో జి.నాగేశ్వర్ రెడ్డి డైరక్షన్ లో ఒక సినిమాను చేసే యోచనలో ఉన్నాడు అని టాక్. అయితే అప్పట్లో తన 50వ సినిమా కోసమని సిద్ధం చేయించిన కథలో ఇప్పుడు నటించేందుకు నరేష్ రంగం  సిద్ధం చేసుకుంటున్నాడు అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే సంవత్సరం పూరి దర్శకత్వంలో అల్లరి నరేష్ యాక్షన్ హీరో అవతారాన్ని చూడబోతున్నాం అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: