తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి కెరీర్ కొనసాగే సమయంలో ఫోటోగ్రఫిపై మోజుతో సినిమాలకు గుడ్ బై చెప్పిన నటి గజాలా. అప్పట్లో అప్ కమింగ్ హీరోలతో నటించిన మంచి ఇమేజ్ సంపాదించింది.  తెలుగు ఇండస్ట్రీలోకి  గజాలా ‘నాలో ఉన్న ప్రేమ’ చిత్రంతో పరిచయం అయ్యింది. తర్వాత ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నంబర్-1’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వచ్చిన చిత్రాల్లో హాట్ హాట్ గా కనిపించినా పెద్దగా సక్సెస్ సాధించలేక పోయింది.

ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా తమిళ భాషలతో కలిపి 28 సినిమాల్లో నటించారు. తర్వాత సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసీ ఫోటో గ్రఫి వైపు వెళ్లింది.   చాలా గ్యాప్ తర్వాత గజాలా మళ్లీ వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. గజాలా తర్వలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది..అది కూడా తనకు నచ్చిన వ్యక్తితో..అవును ఈ అమ్మడు హిందీ సీరియల్స్ లో విలన్ గా నటిస్తూ.. ప్రస్తుతం కొంత బ్రేక్ తీసుకున్న ఫైజల్ రజా ఖాన్ తో ఈనెల 24న గజాలా పెళ్లి జరగనుంది.

గజాలా 


అయితే ఈ పెళ్లి చాల సింపుల్ గా ఇరువురి పెద్దల సమక్షంలో దగ్గరి బంధువుల మద్య జరగబోతున్నట్లు తెలుస్తుంది.  నాలుగేళ్ల క్రితం ఓ పార్టీలో గజాలాను చూసారట ఫైజల్. అలా వారిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసిందట. ఓ ఫోటోగ్రాఫర్ గా కూడా గజాలా తనకు ఎంతో సాయం చేసిందంటున్నారు ఫైజల్.  


మరింత సమాచారం తెలుసుకోండి: