జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా చూసే ఉంటారు. అందులో నడివయసులో ఉన్న బ్రహ్మానందం.. తనకంటే ఎంతో చిన్నదైన నయనతారపై మనసుపడతాడు. మగదిక్కులేని కుటుంబం కావడంతో నయనతార, ఆమె తల్లి రమాప్రభ బ్రహ్మానందాన్ని బాగా వాడేసుకుంటారు. ఆ విషయం తెలిసిన బ్రహ్మానందం శిష్యుడు జూనియన్ ఎన్టీఆర్.. ఎప్పుడూ వీళ్లు.. మా గురువు గారిని సాంతం నాకించేశారు.. అంటూ బాధపడిపోతుంటాడు. 

ఇప్పుడు ఓ సినీ నటిని నమ్ముకున్న ఓ వ్యాపారవేత్త కూడా అలాగే బాధపడుతున్నాడట. అందమైన హీరోయిన్ కదా అని దగ్గరైతే.. తనను పూర్తిగా వాడేసుకుందని బాధపడిపోతున్నాడు. సినిమాల్లో క్రేజ్ తగ్గింది కదా.. ఎలాగూ తననే పెళ్లి చేసుకుంటుంది కదా అని ఆశపడితే.. వాడుకున్నంతవరకూ వాడుకుని.. పిండుకున్నంతవరకూ పిండుకుని అతగాడిని పూర్తిగా వదిలేసిందటా నటీమణి. 

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనేగా మీ సందేహం. ఆమే మేఘనారాజ్. ఈమె కన్నడ, మళయాళ, తమిళ చిత్రాల్లో అనేక సినిమాల్లో నటించింది. నటిస్తోంది కూడా. ఆమె తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిందంటున్నాడు బిజినెస్ మేన్ జనార్దన్ అనే వ్యక్తి. తనను అన్ని విధాలా వాడుకున్న తర్వాత ఇప్పుడు పెళ్లి కుదరంటోందని ఆమెపై  కేసు పెట్టేశాడు. 

బెంగళూరు పోలీసులకు మేఘనారాజ్ వ్యవహారంపై జనార్దన్ కేసు పెట్టాడట. హీరోయిన్ మేఘనారాజ్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. సెలబ్రెటీలపై ఆరోపణలు చేస్తే పాపులర్ కావచ్చని జనార్దన్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడుతోందట. మరి లోగుట్టు పెరుమాళ్లకెరుక..!?



మరింత సమాచారం తెలుసుకోండి: