నేచురల్ స్టార్ నాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈషూటింగ్ బిజీలో ఉన్న నానీకి క్రేజీ యంగ్ హీరో రాజ్ తరుణ్ తన పేరు వాడుకోవడం ఆశ్చర్యంగా మారింది అని వార్తలు వస్తున్నాయి. నాని ఇలా రాజ్ తరుణ్ విషయంలో షాక్ అవ్వడానికి ఒక కారణం ఉంది. వరస విజయాలు తరువాత రాజ్ తరుణ్ లేటెస్ట్ గా నటించిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ తో  ఫ్లాప్ రుచి చూశాడు. 

దీనితో షాక్ అయిన రాజ్ తరుణ్ తన సినిమాల ఎంపికలో అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణం వల్లనే రాజ్ తరుణ్ సీనియర్ డైరెక్టర్ వంశీకి ఒక సినిమా చేస్తాను అని గతంలో ఇచ్చిన మాటకు బ్యాక్ అవుట్ అయిపోయాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాజ్ తరుణ్  లేటెస్ట్ గా ఒక సినిమాను చేయడానికి అంగీకరించడమే కాకుండా ఆ సినిమా దర్శకుడుగా ఒక కొత్త దర్శకుడుకి అవకాశం ఇస్తున్నట్లు టాక్.

ఆ దర్శకుడు పేరు కూడ నాని అని అంటున్నారు. రాజ్‌ త‌రుణ్ న‌టించిన 'సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు' సినిమాకి ఈ నాని స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశాడట. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఈ కొత్త దర్శకుడు రాజ్ తరుణ్ కు ఒక కథ చెప్పి బుట్టలో పడేసాడు అని టాక్. 

ప్రస్తుతం రాజ్ తరుణ్ మంచు విష్ణుతో కలిసి నటిస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే ఈ కొత్త దర్శకుడు నాని రాజ్ తరుణ్ తో కలిసి రంగ ప్రవేశం చేస్తాడని టాక్. దీనిని బట్టి చూస్తూ ఉంటే రానున్న రోజులలో నాని పేరుతో ఇద్దరు వ్యక్తుల హడవిడిని టాలీవుడ్ లో చూడబోతున్నాం అనుకోవాలి. ఏది ఎలా ఉన్నా నాని పేరులోని వైబ్రేషన్ రాజ్ తరుణ్ కు రానున్న రోజులలో ఎలా కలిసి వస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: