నారా రోహిత్ నటించిన ‘తుంటరి’ ఈవారం విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు రీమేక్ సినిమాలలో నటించని రోహిత్ మొట్టమొదటి సారిగా ఒక కోలీవుడ్ సినిమాను ఈ ‘తుంటరి’ గా రీమేక్ చేస్తున్నాడు. ఈసినిమాకు  తెలుగు ఆడియన్స్ టేస్ట్ కు తగినట్లుగా స్టోరీ - స్క్రీన్ ప్లే లో కొన్ని మార్పులు చేశామని కూడా అంటున్నారు. ఈసినిమాలో రోహిత్ బాక్సర్ గా కనిపించ బోతున్నాడు. 

ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు కుమార్ నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ నారా రోహిత్ ను మహేష్ బాబుతో పోలుస్తూ కొన్ని ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసాడు. ‘పోకిరి’ సినిమాతో మహేష్ నటనలోని మరో యాంగిల్ ఎలా బయటకు వచ్చిందో ఈ ‘తుంటరి’ సినిమాతో రోహిత్ లోని మరో యాంగిల్ బయట పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

అంతేకాదు నారా రోహిత్ కు సినిమా మేకింగ్ లో మంచి అనుభవం ఉందని అంటూ ఈసినిమా అవుట్ పుట్ అంత బాగా రావడానికి రోహిత్ ఎన్నో హాలీవుడ్ బాక్సింగ్ సినిమాలను చూసి అనేక సూచనలు ఇచ్చిన విషయాన్ని బయట పెట్టాడు. అదేవిధంగా ఈసినిమాలో బాక్సర్ గా కనిపించడానికి రోహిత్ చాల కష్టపడి తన బాడీ లాంగ్వేజ్ ని కూడ పూర్తిగా మార్చుకున్నాడు అని కామెంట్స్ చేస్తున్నాడు దర్శకుడు కుమార్ నాగేంద్ర. 

ఈవార్తలు ఇలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏ సినిమా లైఫ్ అయినా 2, 3 వారాలకు మించి ఉండడం లేదు కాబట్టి ఒకే నెలలో తన సినిమాలు రెండు విడుదలైనా ప్రమాదం లేదని భావిస్తూ ఇలా వరస పెట్టి సినిమాలు చేస్తున్నాను అంటూ కామెంట్స్ చేసాడు. రోహిత్ చేసిన కామెంట్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఈ నారా వారి అబ్బాయి పెద్ద మాస్టర్ ప్లాన్ లో ఉన్నట్లే తెలుస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: