నారా వారి అబ్బాయి రోహిత్ జోరు చూస్తుంటే ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఎక్కడ వీలు కుదిరితే అక్కడ షూట్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. పరిశ్రమకు పరిచయమైన నాలుగు సంవత్సరాల్లో కేవలం ఆరు సినిమాలు చేసిన రోహిత్ ఇప్పుడు సెట్ మీద 9 సినిమాలతో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఇక వాటిలో తుంటరి, సావిత్రి రిలీజ్ కు రెడీ అవుతుండగా.. రాజా చెయ్యి వేస్తే కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది.


రాజా చెయ్యి వేస్తే సినిమాలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ నందమూరి తారక రత్న విలన్ రోల్ చేయడం. ఇప్పటికే సినిమా గురించి రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒక తుంటరిగా సావిత్రి ప్రేమను పొందాలనుకునే నారా రోహిత్.. రాజా చెయ్యి వేస్తే ఎలా ఉంటుందో తన సినిమాతో చూపిస్తున్నాడు. ఫుల్ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమా కూడా సమ్మర్ రేసులో నిలుస్తుండటం విశేషం.


ఇక చాలా కాలం తర్వాత తారక రత్న తన అదృష్టాన్ని మరోసారి పరిక్షించుకోబోతున్నాడు. నారా రోహిత్ తో సపోర్ట్ తో రాజా చెయ్యి వేస్తే సినిమాలో విలన్ గా కనిపిస్తున్న తారక రత్న ఈ సినిమా హిట్ అయితే పవర్ ఫుల్ విలన్ గా సెట్ అవుదాం అనే ఆలోచనలో ఉన్నాడు. మరి రాజా చెయ్యి వేస్తే అటు వరుసెంట సినిమాలు చేస్తున్న రోహిత్ కు, ఇటు కెరియర్ ఎండ్ అయింది అనుకున్న తారక రత్న జాతకంలో మార్పు వస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా నిర్మాత వారాహి సాయి కొర్రపాటి అవడం మరి చెప్పుకోదగ్గ అంశం.


ఇప్పటికే తన బర్త్ డే నాడు ఎన్నడు లేని విధంగా బాబాయ్ విశెష్ ను అందుకున్న తారక్ రత్న ఈసారి గట్టిగానే హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఇక తన సావిత్రి సినిమాకు మొదటిసారి బాలయ్యతో ఆడియో రిలీజ్ చేయించి ఆశిర్వాదాలు తీసుకున్న నారా రోహిత్ కూడా కెరియర్ లో కమర్షియల్ సక్సెస్ కొట్టే రోజు దగ్గర పడ్డదనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: