తెలుగు తమిళ సినిమాలలో ఉన్న ఒకే ఒక్క పోలిక ఏంటంటే భారీ బడ్జెట్ సినిమా అనగానే షూటింగ్ , మేకింగ్ కి చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. భారీ పెట్టుబడి పెడుతున్న ఏ నిర్మాత అయినా తన సినిమా చాలా నెమ్మదిగా సాగాలి అనుకుంటాడు అదేంటో. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సారి చాలా ఫాస్ట్ గా తన సినిమా పూర్తి చెయ్యబోతున్నారు. భారీ బడ్జెట్ సినిమా లింగా ని కేవలం నాలుగు అయిదు నెలల్లో నే పూర్తి చేసిన రజినీకాంత్ ఆ తరవాత కొంత టైం తీసుకుని కేవలం నూట ఇరవై రోజుల్లో కబాలి షూటింగ్ ని పూర్తి చెయ్యబోతున్నారు.

 

 

 

 

 అలాగని ఇదేమీ తక్కువ బడ్జెట్ సినిమా కాదు ఇది కూడా భారీ బడ్జెట్ సినిమా నే. దేశ విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది కూడా.  దకిణాది లో భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే వారందరికీ భిన్నంగా రజనీ దూసుకుపోతున్నాడు.  కానీ వేగంగా పూర్తి చేసిన సినిమాలు అట్టర్ ప్లాప్ అవుతూ ఉండడం , రజినీకాంత్ అభిమానులకి కొత్త భయాన్ని ఇస్తోంది. లింగా కి ఇలాగే హడావిడి గా పూర్తి చేసి దెబ్బ తిన్నాం అనీ , కబాలి కి కావలసినంత సమయం తీసుకుంటే బాగుండేది అని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. లింగా లాంటి రిజల్ట్ దీనికి ఒస్తే తమ పరిస్థితి ఏంటి అని ఫాన్స్ భయపడుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: