సత్యమేవ జయతే అనే కార్యక్రమం మీద అమీ ఖాన్ భారతదేశానికి సంబంధించిన చిహ్నాలను వాడుతున్నారని.. పిల్ వేయడం జరిగింది. ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం దేశం యొక్క చిహ్నాలను వాడటం చట్టపరంగా నేరం అని.. ఆ కార్యక్రమాన్ని వెంటనే ఆపివేయాలని అన్నారు.


మనోరంజన్ రాయ్ వేసిన పిటీషన్ లో సత్యమేవ జయతే అనేది ప్రోగ్రాం టైటిల్ పెట్టడం కూడా దేశ సమగ్రతకు నష్టం కలిగిస్తుందని.. టెలివిజన్ ప్రోగ్రాంకు దేశానికి సంబంధించిన సత్యమేవ జయతే అన్న పదాన్ని వాడటం పట్ల తమ అభిప్రాయాన్ని తెలియచేయవలసిందిగా హైకోర్ట్ కోరడం జరిగింది.  


భారత దేశ యాంబ్లం అయిన సత్యమేవ జయతే పదాన్నే టైటిల్ గా పెట్టి నడిపించడం అనేది అతిక్రమణ చర్యలే అని.. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ తన అఫిడవిట్ లో పేర్కుంది. అయితే అతిక్రమణలకు మించి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారా లేదా అనేది. వివరణ కోరుతూ ప్రోగ్రాం రన్ చేస్తున్న స్టార్ టివి వారిని, అమీర్ ఖాన్ ను ఏప్రిల్ 20 వరకు వివరణ ఇవ్వాల్సిందిగా కోర్ట్ ఆదేశించింది.  


భారదేశంలో అసహనం అంటూ దుమారానికి లేపిన అమీర్ ఖాన్ దాని వల్ల తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సత్యమేవ జయతే మీద వస్తున్న ఆరోపణలను తాను ఎలా ఎదుర్కుంటాడో చూడాలి. ప్రస్తుతం స్టార్ టివిలో టెలికాస్ట్ అవుతున్న సత్యమేవ జయతే ప్రోగ్రాం 2012 మరియు 2014 రెండు సీజన్ల నుండి ప్రసారమవుతుంది ప్రస్తుతం సీజన్ 3 స్టార్ టివిలో టెలికాస్ట్ అవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: