టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ మీదున్న తమన్నా గురించి ఎవరు ఊహించని న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మోడలింగ్ నుండి కెరియర్ ఆరంభించిన తమన్నా 'శ్రీ' సినిమాతో హీరోయిన్ అయ్యింది. ఇక ఆ సినిమా పర్వాలేదనిపించుకున్నా కొన్నాళ్లు గ్యాప్ తో హ్యాపీ డేస్ సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. అయితే తమన్నా మోడలింగ్ చేస్తున్న రోజుల్లో ఆమెను చాలా చీప్ గా వాడేశారట.


అదేంటి అంటే కెరియర్ మొదట్లో చిన్నా చితకా యాడ్స్ లో కూడా అమ్మడు నటించేదట. అయితే అవి తన కెరియర్లో ఎక్కడో ఓ చోట ఉపయోగపడతాయనే అభిప్రాయంతో వెయ్యికి రెండు వేలకి కూడా యాడ్స్ చేసిందట తమన్నా. ఇప్పడు సినిమా అంటే కోటి ఉంటేనే అనే అమ్మడు కెరియర్ మొదట్లో ఇలా చేసిందా అని తెలుసుకున్న వారు షాక్ అవుతున్నారు.


మరి స్టార్ రేంజ్ రావాలంటే ఆమాత్రం కష్టపడక తప్పదు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకటిగా ఉన్న తమన్నా రీ ఎంట్రీ హ్యాపీ డేస్ సినిమా నుండి క్రేజీ హీరోయిన్ గా మారింది. తన మొదటి సినిమాలో కూడా కేవలం 3 లక్షల పారితోషికంతో సరిపెట్టుకుందట ఈ భామ. చేస్తున్న సినిమాలు హిట్ అవుతున్నా కొద్ది చిన్న చిన్నగా రెమ్యునరేషన్ కూడా పెంచుకుంటూ వచ్చింది.


ఇప్పుడు తెలుగు తమిళ్ లో సూపర్ క్రేజ్ ఉన్న తమన్నా అందం అభినయం కలగలిపి ప్రేక్షకుల ముందు ఆవిష్కరిస్తుంది. చేతిలో రెండు మూడు సినిమాల దాకా ఉన్న తమన్నా మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలు కొనసాగిస్తుంది. ఒక్కరోజులోనే స్టార్డం వచ్చేయలేదు కాబట్టే చేతిలో సినిమాలున్నా లేకున్నా తమన్నా కాన్ఫిడెన్స్ ఎక్కడికి పోదు. ఎందుకంటే తను ఆల్రెడీ కింద స్థాయి నుండి వచ్చింది కాబట్టి అంత త్వరగా కెరియర్ అజాగ్రత్త పాలు చేసుకోదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: