మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య చాలా మారిపోయింది. సినిమాల్లో ఎలాంటి రోల్ అయినా చేసేస్తా అంటూ హాట్ స్టేట్మెంట్ ఇస్తున్న ఈ భామ ఇక నుండి సినిమాల్లో ఐటం సాంగ్స్ అయినా సరే అంటూ దర్శక నిర్మాతలకు సిగ్నల్స్ ఇస్తుంది. టాప్ హీరోయిన్ గా చెలామని అవుతున్న తమన్నా ఎందుకు ఐటం సాంగ్స్ కు ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే దానికో రీజన్ చెబుతుంది అమ్మడు.


కుర్ర హీరో అయినా స్టార్ హీరో అయినా ఐటం సాంగ్ అంటే తమన్నా గుర్తుకు రావాల్సిందే. మొన్నా మధ్య బెల్లంకొండ సురేష్ తనయుడు తెరంగేట్రం సినిమాలో మిల్కీ బ్యూటీ మిల్కీ బ్యూటీ అంటూ తన హాట్ అందాల సొగసుల్లో ప్రేక్షకులను ముంచెత్తిన ఈ సుందరి మరోసారి అదే శ్రీనివాస్ స్పీడున్నోడు సినిమాలో బ్యాచిలర్ బాబు అంటూ అదరగొట్టేసింది. 


ఒక్క బెల్లంకొండ శ్రీను కోసమే కాదు ఏ కుర్ర హీరో అయినా ఐటం సాంగ్ కోసం తనను సంప్రదించవచ్చు అని డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంది తమన్నా. అయితే స్టార్ హీరోల సినిమాల్లో నటించినా సరే ఐటం సాంగ్ తో వారితో కాలు కదిపితే ఆ కిక్కే వేరు. అదిగాకా స్టార్ హీరోలు తమతో ఆడే పర్ఫెక్ట్ జోడిని అంటే తన లాంటి ఐటం గాళ్ గా కోరుకుంటారు అంటుంది. అబ్బో అంటే సౌత్ లో సూపర్ ఐటం భామ అంటే తమన్నా అనాలేమో ఇకనుండి. 


మరి అమ్మడి వర్శన్ ఇలా ఉంటే అందరు అనుకునే మాట ఏంటంటే తమన్నా ఐటం సాంగ్స్ చేసే కారణం ఓ సినిమా చేసినంత రెమ్యునరేషన్ కు అటు ఇటుగా ఓ సాంగ్లో లాగేయొచ్చు అని.. మరి ఎవరి ఈక్వేషన్స్ వారికి ఉంటాయనుకోండి ఏది ఏమైనా హాట్ ఐటం గా తమన్నా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది అన్న మాట మాత్రం వాస్తవం. 



మరింత సమాచారం తెలుసుకోండి: