‘బాహుబలి’ లో భల్లాలదేవుడి పాత్ర చేసిన తర్వాత రానా నేషనల్ సెలిబ్రిటీగా మారిపోవడంతో బాలీవుడ్ కోలీవుడ్ లలో కూడ రానాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. దీనితో రానా పేరు తరుచు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. అయితే రాబోయే సినిమాల గురించిన వార్తలు కంటే అందమైన  బ్యూటీలతో అఫైర్స్ వార్తల్లో ఎక్కువగా రానా పేరు వినపడుతూ ఉంటుంది.

త్రిషతో డేటింగ్ వ్యవహారం ముగిసిపోయాక లేటెస్ట్ గా శ్రియతో రిలేషన్  మైన్ టైన్ చేస్తున్నాడు అంటూ ఇప్పటికే రానా పై రూమర్స్ షికార్లు    చేస్తున్నాయి. అయితే  తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ శ్రియ వీటిని  ఈమధ్యనే ఖండించింది. దీనితో రానా ఇప్పుడు మరో హీరోయిన్ తో చక్కర్లు కొడుతున్నాడు అంటూ మరో గాసిప్ తెరపైకి వచ్చింది. 

గతంలో బేబీ మూవీలో రానా – తాప్సీ లు కలిసి నటించినా వారి గురించి పట్టించుకోని బాలీవుడ్ మీడియా ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న  ‘ఘాజీ’ చిత్రంతో బాగా క్లోజ్ అయ్యారు అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీళ్లు బాగా దగ్గరయ్యారని  వీరిద్దరూ కలిసి లంచ్ బ్రేక్ టీ బ్రేక్స్ లో తెగ కబుర్లు చెప్పుకోవడం మీడియా కంటపడటంతో వీళ్లద్దరి మధ్య ఏదో ఉందని ఈ సినిమా యూనిట్ సభ్యులే అనుకుంటున్నారు అని అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.

 ఈ విషయం మెల్లగా ఇండస్ట్రీలో పాకిపోవడంతో ఈసారి తాప్సీ రంగంలోకి స్పందించింది.  తమ ఇద్దరికీ కంబైన్డ్ ఇష్టాలు ఉన్నాయి అంటూ తాప్సీ మరో ట్విస్ట్ ఇచ్చింది  ‘మేము ఒకళ్ల కంపెనీని ఒకరం ఇష్టపడుతున్నాం. మా ఇద్దరికీ కామన్ గా నచ్చిన ఫుడ్ మెనూ ఉంది. దీనితో ఇద్దరం కూర్చుని ఇవాళ లంచ్ ఏం చేయాలని మెనూ డిసైడ్ చేస్తుంటాం. రాణా లాంటి ఫుడ్ లవర్ దగ్గరుంటే నోటిని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం’ అంటూ వివరించింది తాప్సీ. దీనితో రానా తాప్సీని తన ఫుడ్  హబిట్స్ తో బుట్టలో పడేసాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: