జెమిని చిత్రంలో వెంకటేశ్ కి సమానంగా వింత వింత జంతువుల మిమిక్రీ అనుకరిస్తూ..హావబావాలు ప్రదర్శిస్తూ..అద్భుతమైన నటన కనబరిచిన నటుడు కళాభవణ్ మణీ. తర్వాత తెలుగులో పెద్ద చాన్సులు రాకపోయినా..తమిళ,మళియాల చిత్రాల్లో బాగా పాపులర అయ్యారు. మళయాలం, తమిళం, తెలుగు సినీ పరిశ్రమల్లో పలు అద్భుతమైన పాత్రలతో మెప్పించిన నటుడు కళాభవణ్ మణి కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో  కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న తుదిశ్వాస విడిచారన్న వార్త తెలిసిందే.  


కళాభవణ్ మణిది సహజ మరణం కాదా? ఆయన మీద విష ప్రయోగం జరిగిందా? ఔననేనే అంటున్నాయి తాజా పరిణామాలు. మణి మృతి పై వచ్చిన అనేక అనుమాణాల నేపథ్యంలో అది సహజ మరణం కాదేమో అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. తాజాగా టాక్సాలజీ రిపోర్ట్ రాగా ఆయన దేహంలో విష పదార్ధాలు ఉన్నట్టు గుర్తించారు. కొచ్చిలోని కక్కనాడ్ ప్రాంతీయ రసాయన పరీక్షా కేంద్రంలో కళాభవణ్ మణీకు టాక్సాలజీ టెస్ట్ లు చేసారు.



క్లోర్ పిరిఫోస్ అనే క్రిమి సంహారిణి అవశేషాలు ఆయన శరీరంలో ఉన్నట్టు ఈ టెస్ట్‌లో వెల్లడైంది. అంతేకాదు మిథైల్, ఇథైల్ ఆల్కహల్ కూడా అతని శరీరంలో ఉన్నాయని జాయింట్ కెమికల్ ఎగ్జామినర్ కె. మురళీధరన్ నాయర్ చెప్పారు. కళాభవణ్‌ని ఎవరైనా విష పదార్ధాలు ఇచ్చి చంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: