నందమూరి మూవీ నటిసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. తాజాగా మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు అనే విషయం ఇండస్ట్రీలో బాహాటంగానే వినిపిస్తుంది. దీనికి సంబంధించిన వార్తలకి సైతం బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరమే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఉంటుందని బాలకృష్ణ క్లారిటీ ఇవ్వటంతో అందరూ ఈ హీరో ఎంట్రి ఎలా ఉండబోతుందో అంటూ ఎదురు చూస్తున్నారు.


ఇదిలా ఉంటే తాజాగా ఇండియా టుడే మ్యాగజైన్ నందమూరి బాలకృష్ణపై ఓ ప్రత్యేక ఎడిషన్ ను ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్ లో బాలకృష్ణ సినీ, రాజకీయ జీవిత విశేషాలను ఎన్నింటినో వివరించింది. ఎన్టీఆర్ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తున్న తీరు, అలాగే బాలకృష్ణ వారసత్వంగా రాబోతున్న మోక్షజ్ఞ ఎంట్రీ విశేషాలను ఇక్కడ ప్రస్థావించింది.


అయితే ఈ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ , తన తండ్రి గురించిన చెప్పిన విశేషాలు ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. బాలకృష్ణ ఎప్పుడూ తనన ఒక స్నేహితుడిలా చూశాడు కానీ,  కొడుకుని పెంచినట్టుగా పెంచలేదని అన్నాడు. ఎప్పుడూ తన తండ్రితో స్నేహభావం ఉంటుంది కానీ...ఇద్దరం తండ్రి కొడుకు లాగా ఉండలేదని చెప్పుకొచ్చాడు.


అలాగే తనపై తన తండ్రి ఎన్నడూ ఏ విషయంలోనూ ఒత్తిడి చెయ్యలేదని తెలిపారు. తన తండ్రి గురించి మోక్షజ్ఞ చెప్పిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ పై మోక్షజ్ఞ చూపించిన ప్రేమ చాలా గొప్పగా ఉందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: