ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, నందమూరి నటసింహం బాలకృష్ణ తన కొత్త మూవీ కోసం కొత్త గెటప్ లో కనిపిస్తున్నాడని అంటున్నారు. మొన్నటి వరకూ ఫుల్ షేవింగ్ తో కనిపించిన బాలకృష్ణ,ఇప్పుడు మీసాలను సినిమా కోసమే పెంచినట్టుగా కనిపిస్తున్నాడు. దీంతో అందరూ బాలకృష్ణ అప్ కమింగ్ ఫిల్మ్ కి రెడీ అయినట్టే అని అంటున్నారు.


అయితే దీనికి సంబంధించిన మరోక వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్ చేస్తుంది. రాజ చెయ్యి వేస్తె ఆడియో వేడుకలో బాలయ్య కొత్త లుక్ అందరికి ఆకట్టుకున్నప్పటికీ..ఇది సినిమా కోసం కాదు అని అంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ తన 100 వ సినిమా కోసం సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో, ఈ తరహా మీసకట్టు అందరిలోనూ ఇదే ఆలోచనలను రేపుతుంది.


గౌతమి పుత్రా శాతకర్ణి కథతో తెరకేక్కే ఈ సినిమా కోసమే ఈ లుక్ పెట్టాడా? అనేది ఓపెన్ గా వినిపిస్తన్న టాక్స్. అయితే బాలకృష్ణ ఈ లుక్ ని  తన 100వ సినిమా కోసం కాకుండా సరదా కోసం పెట్టుకున్న మీసకట్టు అని అంటున్నారు. కానీ అందరూ బాలకృష్ణ తన 100వ సినిమా కోసం మీసకట్టుని పెంచాడని అంటుంటే ఇది గాసిప్ అని నందమూరి వర్గాలు అంటున్నారు.


అయితే బాలకృష్ణ 100వ సినిమాపై వస్తున్న టాక్స్ పై క్లారిటీ రావాలంటే, ఈ ఉగాది వరకు ఆగాల్సిందే అని అంటున్నారు. మొత్తంగా బాలకృష్ణ మీసకట్టు వ్యవహారంతో మీడియాకి సైతం కొంత పని వచ్చినట్టుగా అయింది. ఎవరికి తోచింది వారు రాసేసుకుంటున్నారు. ఇక బాలకృష్ణ 100వ సినిమాలో తనయుడు సైతం ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: