మెగాస్టార్ ఇంట ఇప్పుడు సంతోషాల వెల్లువ కొనసాగుతుంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం నిన్న బెంగళూర్‌లోని ఫామ్‌ హౌస్ లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్ళి తర్వాత ఈ దంపతులు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారట. ఇక ఈ పెళ్లి పెళ్లి వేడుకను ఐదు రోజుల పండుగగా నిర్వహించగా మెహందీ, సంగీత్‌ ఫంక్షన్‌లలో మెగా ఫ్యామిలీ చాలా సందడి చేసినట్టు తెలుస్తుంది. శ్రీజ కుటుంబ సభ్యులతో పాటు కళ్యాణ్‌ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నట్టు సమాచారం.


సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎవరూ హాజరు కాలేదు..అలాగే రాజకీయ నాయకులు కూడా ఎవ్వరూ హాజరు కాలేదు. ఒక్క మెగా ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ..కళ్యాన్ కుటుంబం మాత్రమే పాల్గొన్నారు.  కాకపోతే మెహందీ వేడుకలకు మాత్రం అక్కినేని అఖిల్, రానా,రాఘవేంద్ర రావు లు మాత్రం ముఖ్య అతిధులుగా పాల్గొన్నట్లు తెలిసింది. అంతే కాదు వీరితో పాటు చిరంజీవి తో పలు సినిమాల్లో నటించిన సుమలత ఆమె భర్త అంబరీష్‌ కూడా వేడుకలో పాల్గొన్నారు.

సుస్మితతో స్టెప్పులేస్తున్న చిరంజీవి


ఈ వేడుకలో చిరు తన పెద్ద కూతురు సుస్మితతో 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' అనే పాటకు స్టెప్పులేసారు. మెగా ఫ్యామిలీ వచ్చిన అతిధులని కూడా ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ మెగా వేడుకలో శ్రీజ, కళ్యాణ్‌లు కలిసి స్టెప్పులు వేసిన ఓ వీడియోతో పాటు చిరు వీడియో ఒకటి లీక్ అయ్యింది..ఇప్పుడు ఈ విడియో సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: