తెలుగు హీరోయిన్ లలో టాప్ పొజిషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హీరోయిన్ లలో రేజీనా కసాంద్రా ఒకరు. మెగా హీరోలతో తన కెరీర్ మొదలు పెట్టి పరవాలేదు అనిపించుకునే హిట్ లు కొట్టిన రేజీనా కి ఈ మధ్య సినిమాలు బొత్తిగా లేవు అనే టాక్ కూడా ఉంది. అయితే గ్లామర్ ఒలకబోయ్యడం లో రేజీనా కి ఆమె సాటి అని చెప్పాలి. కుర్రాళ్ళ మనసులు గిలిగింతలు పెట్టే రేజీనా ఇప్పుడు డీ గ్లామర్ పాత్రలలో మెరవబోతోంది. డీ గ్లామర్ పాత్రలు అంటే గ్లామర్ ని పక్కన పెట్టి ఏ దయ్యంగా నో, పనిమనిషి లాగానో .. సింపుల్ గా చెప్పాలి అంటే అందాల ఆరబోత ఉందని పాత్ర అన్న మాట. రేజీనా ఇప్పుడు కుర్ర హీరోలు అందరితో చేస్తూ తెగ బిజీ అయిపొయింది.





ప్రస్తుతం తమిళం లో  మరప్పదిల్లై, మానగరం, రాజతందిరం-2 సినిమాలు చేతిలో పెట్టు కుంది. తెలుగు లో మాత్రం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు ఆమెకి. డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకి ఎక్కించిన మరప్పదిల్లై సినిమా లో ఆమెది సూపర్ పాత్ర అంటున్నారు. ఈ సినిమా లో ఎస్ జే సూర్య హీరో. ఈ సినిమా హర్రర్ కథ తో నడవడం తో ముఖ్య పాత్ర ఆమె పోషిస్తోంది. ఒక స్పెషల్ సాంగ్ లో ఆమె హావ భావాలూ, గెటప్ లూ అదిరిపోతాయ్ అంటున్నారు. మొదటి సారి ఆమెలోని గ్లామర్ ని పక్కన పెట్టి యాక్షన్ పరంగా అదిరిపోయే పాత్ర అవుతుంది ఇది అంటున్నారు చిత్ర బృందం .

మరింత సమాచారం తెలుసుకోండి: