టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా ‘సర్ధార్ గబ్బర్ సింగ్’  రోజు రోజుకీ భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం స్విట్జర్లాండ్ వెళ్లి షూటింగ్ పూర్తి చేసారు. అంతే కాదు ఈ చిత్రం ఏప్రిల్ 8 న ప్రపంచ వ్యాప్తంగా 3 వేల థియేటర్లో భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు చిత్ర యూనిట్. మరో వైపు ఈ చిత్రంపై ఇప్పటికే నీలినీడలు అల్లుకుంటున్నాయి..ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినా..పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయి..ఎప్పుడు రిలీజ్ అవుతుందీ అన్న విషయంపై అటు ఇండస్ట్రీ వర్గాలు..ఇటు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేసే పవన్ కళ్యాన్ ఈ సారి కూడా తన స్టేటజీ ఉపయోగించాడు.. షూటింగ్ పూర్తయిన వెంటనే సినిమా ఫైనల్ కాపీ రెడీ చేసి ఈ రోజు  సెన్సార్‌కు పంపడం జరిగింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాక సెన్సార్ బోర్డ్ నుండి యు/ఎ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 8న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సర్ధర్  చిత్రానికి స్క్రిప్టు, డైరెక్షన్ పవన్ కళ్యాణే హ్యాండిల్ చేసాడు. ఈ నేపథ్యంలో తన తాజా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి పవన్ కళ్యాణ్ స్వయంగా స్క్రిప్టు సమకూర్చడం చర్చనీయాంశం అయంది.ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...సినిమా ఏప్రిల్ 8 న ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పారు.

సర్ధార్ గబ్బర్ సింగ్ పోస్టర్


ఈ చిత్రం కోసం తనతో సహ చిత్ర యూనిట్ మొత్తం సంక్రాంతి పండుగ కూడా జరుపుకోకుండా కష్టపడి షూటింగ్ త్వరగా పూర్తి చేశామని చెప్పారు. డైరెక్టర్ బాబీ సహా అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. బాబీకి థాంక్స్. కథాంశం చతీస్ గడ్, మనకు దగ్గరకగా ఉండే కథ కాబట్టి ఈ సినిమాను సునీల్ లుల్లాగారు హిందీలో రిలీజ్ చేస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: