తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కెరీర్ పూర్తిగా మలుపు తిప్పిన చిత్రం ‘గబ్బర్ సింగ్’..ఈ చిత్రంలో పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో మెగా ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించారు. నేను ట్రెండ్ ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తా అనే డైలాగ్ నిజంగా పవన్ కళ్యాన్ కి కరెక్ట్ గా సెట్ అవుతుందీ అనడంలో అతిశయోక్తి లేదు. ఒక్క సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చూపిస్తూ...రాజధాని బాధితుల విషయంలో ప్రభుత్వాన్ని కదిలించి ఓ ట్రెండ్ సెట్ చేశారు..ఇప్పుడు సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంపై విపరీతమైన ఫోకస్ తీసుకువచ్చి మరోసారి తనదైన స్టైల్ చూపించాడు. ఆ మద్య సర్ధార్ ఆడియో వేడుకలు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిధిగా పిలిచి అన్నదమ్ముల అనుబంధం చాటాడు..ఈ వేధికపై చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాన్ ని బీభత్సంగా పొగిడారు

అంతే కాదు పవన్ తల్చుకుంటే ఏదైనా సాధ్యమే..తాను రెండు రకాల పాత్రలు జీవితంలో వేయాల్సి ఉంటుందని ఫ్యాన్స్ కోసం..సినిమాల్లో..బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయాల్లో సమర్ధవంతంగా తన విధులు నిర్వహించాలని అందుకు పవన్ తప్పకుండా ఒప్పుకుంటాడని ఫ్యాన్స్ ముందు అన్నారు. ఇకపోతే సర్ధార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8 న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పుడు అందరికీ ఒక్కటే టెన్షన్ పట్టుకుంది..ఈ సమయంలో షూటింగ్ కోసం స్విజ్జర్లాండ్ వెళ్లడం అక్కడ షూటింగ్ జరుపుకోవడంతో ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తారు అన్న ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. అయితే ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేసే పవన్ కళ్యాన్ ఈ సారి కూడా తన స్టేటజీ ఉపయోగించాడు.. షూటింగ్ పూర్తయిన వెంటనే సినిమా ఫైనల్ కాపీ రెడీ చేసి ఈ రోజు  సెన్సార్‌కు పంపడం జరిగింది. 


సర్ధార్ గబ్బర్ సింగ్


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాక సెన్సార్ బోర్డ్ నుండి యు/ఎ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది.  సర్ధర్  చిత్రానికి స్క్రిప్టు, డైరెక్షన్ పవన్ కళ్యాణే హ్యాండిల్ చేసాడు. సర్ధర్  చిత్రానికి స్క్రిప్టు, డైరెక్షన్ పవన్ కళ్యాణే హ్యాండిల్ చేసాడు. ఈ నేపథ్యంలో తన తాజా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి పవన్ కళ్యాణ్ స్వయంగా స్క్రిప్టు సమకూర్చడం చర్చనీయాంశం అయంది.ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...సినిమా ఏప్రిల్ 8 న ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: