పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి ముందు దర్శకుడు బాబీ ధర్నాకు దిగబోతున్నాను అంటూ తానే స్వయంగా మీడియాకు లీక్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే వారం విడుదల కాబోతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు బాబీ ఈ విషయాన్ని స్వయంగా తెలియచేసాడు. 

పవన్ మరో రెండు మూడు సినిమాలు చేసి సినిమా రంగం నుండి గుడ్ బై చెపుతాను అంటే తాను ఎట్టి పరిస్తుతులలోను అంగీకరించమని పవన్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే పవన్ ఇంటిముందు ధర్నా చేసే వారిలో ముందు వరసలో తాను ఉంటానని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు బాబి. అంతేకాదు పవన్ వదులుకునే పరిస్థుతులలో పవన్ అభిమానులే కాదు ప్రస్థుత సినిమా రంగ పరిశ్రమ కూడ లేదని అంటూ ఆ శక్తికర కామెంట్స్ చేసాడు బాబి.

ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ తో పని మెప్పించడం అంత సులువు కాదని అంటూ పొగడ్తలకు పడిపోయే మనస్తత్వం పవన్ కళ్యాణ్ కు లేదు అంటూ కామెంట్స్ చేసాడు బాబి. సాయంత్రం షూటింగ్ అయిపోయాక పవన్ పసిపిల్ల వాడులా మారిపోతాడని అంటూ తానే చేసే ప్రతి పని గురించి అందరి సలహాలు తీసుకుంటూ చివరికి తాను ఒక నిర్ణయానికి వస్తాడు అంటూ పవన్ లోని పసి హృదయాన్ని బయట పెట్టాడు. 

ఈ సినిమా డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ప్రమేయం ఎక్కువగా ఉంది అన్న వార్తల పై స్పందిస్తూ అవన్నీ గాసిప్స్ అని కొట్టి పారివేసాడు. అంతేకాదు సినిమాకు సంబంధించిన ప్రతి విభాగంలోనూ పవన్ కు నైపుణ్యం ఉండటంతో సలహాలు ఇచ్చిన మాట వాస్తవమే కాని ఎదుటి మనిషిని అవమాన పరిచే మనస్థత్వం పవన్ కు లేదు అని అంటూ రెండేళ్లుగా పవన్ సినిమా కోసం ఎదురు చూస్తున్న పవన్ అభిమానులకు ఏ మాత్రం నిరాశ కలిగించని సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అంటూ ఈ సినిమా పై తన రేంజ్ లో అంచనాలు పెంచేసాడు బాబి.



మరింత సమాచారం తెలుసుకోండి: