పవన్ కళ్యాన్ దాదాపు రెండు సంవత్సరాల  తర్వాత ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ గా వెండి తెరపై కనిపించబోతున్నాడు..ఇప్పటికే ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అంతే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు స్విజ్జర్లాండ్ లో పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్స్, టీజర్లు, ట్రైలర్, వీడియో మేకింగ్ లతో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించాడు పవన్. ఇక్కడ పవన్ మానియా విపరీతంగా పెరిగిపోయింది..మరోవైపు టిక్కెట్ల హడావిడి పెరిగిపోయింది. అప్పుడే సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం టిక్కెట్లు బ్లాక్ లో అమ్మెస్తూ క్యాష్ కూడా చేసుకుంటున్నారు..ఒక్క టిక్కెట్ 3000 ల చొప్పున అమ్ముతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సర్ధార్ గబ్బర్ సింగ్ పోస్టర్


అంతా బాగుంది కానీ ఇప్పుడు పవన్ ని ఓ బుడ్డోడు టెన్షన్ పెడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదేంటీ పవన్ అంతటి వాడిని ఓ కుర్రోడు టెన్షన్ పెట్టడం ఏంటా అనుకుంటున్నారా..? అదేనండి గతంలో దూరదర్శన్ లో ‘జంగిల్ బుక్’ అనే కార్టూన్ సీరియల్ వచ్చేది..అప్పట్లో అదంటే ప్రతిఒక్కరికీ ఎంతో ఇష్టంగా ఉండేది..చిన్న పెద్దా అని తేడా లేకుండా అప్పట్లో జంగల్ బుక్ లో మోగ్లీ చేసే చిత్ర విచిత్రమైన విన్యాసాల్ని టీవీ లకు అతుక్కుపోయి మరి చూశాం. తాజాగా ఇప్పుడు ఇండియాలో విడుదల కానున్న 'జంగల్ బుక్' హీరో నీల్ సేథి.  ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది...దీనిపై కూడా ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.

‘జంగిల్ బుక్’ పోస్టర్


అసలే వేసవి కాలం చిన్నపిల్లలకు ఇలాంటి చిత్రాలంటే విపరీతమైన క్రేజ్ మరి ఇదే సమయంలో అంటే సర్ధార్ గబ్బర్ సింగ్ విడుదల రోజే జంగల్ బుక్ కూడా విడుదల అవుతోంది.  హాలీవుడ్ సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులు బాగా చూస్తారు...కాకపోతే ఈ మద్య ఇక్కడ కూడా మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చిన తర్వాత ఈ తరహా చిత్రాలకు విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది. ఒకవేల జంగిల్ బుక్ కి పాజిటీవ్ టాక్ వస్తే మాత్రం ‘గబ్బర్ సింగ్ ’ కలెక్షన్లకు కాస్త దెబ్బపడే అవకాశం కనిపిస్తుంది. ఇక అమెరికాలో జంగల్ బుక్ చిత్రాన్ని ఏప్రిల్ 15 న విడుదల చేయనున్నారు. కాబట్టి తొలి వారం పవన్ కలెక్షన్లు బాగానే రాబట్టోచ్చని అంచనా వేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: