పు విడుదల కాబోతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బాలీవుడ్ లో ఘోరమైన ఫ్లాప్ గా మారిపోతుందని బాలీవుడ్ దర్శకుడు నటుడు కమల్ ఖాన్ ఒక వైపు జోస్యం చెపుతూ ఉంటే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ‘సర్దార్’ కు నార్త్ లో ఎదురులేదని ఈసినిమా హిందీ ల్యాండ్ లో సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పడం బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. తరణ్ అభిప్రాయం ఈసినిమా  ఇతర తెలుగు చిత్రాలవంటిది కాదని ఉత్తరాదివారిని కూడా ఆకట్టుకునే ఫీచర్స్ ఇందులో ఉన్నాయని అని కామెంట్ చేయడం ప్రస్తుతం షాకింగ్ న్యూస్ గా మారింది. 

అయితే మరో కొంతమంది విమర్శకులు ఈ సినిమా పై కామెంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ లిప్ మూమెంట్ కు సరిపోయేలా హిందీ డబ్బింగ్ చెప్పడం కష్టమని అందువల్ల డబ్బింగ్ వెర్షన్ లో వచ్చే పవన్ పంచ్ డైలాగ్స్ విషయంలో లిప్ మూమెంట్ లో ఏదైనా తేడా వస్తే దాని ప్రభావం సర్దార్ సక్సస్ పై తీవ్ర ప్రభావం చూపెడుతుందని కామెంట్స్ వ్రాస్తున్నారు. అదేవిధంగా ‘బాహుబలి’ చిత్రానికి నార్త్ లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ లభించిందని అయితే  ‘సర్దార్ గబ్బర్ సింగ్’ హక్కులు పొందిన ఈరోస్ ఇంటర్నేషనల్ అలాంటి  ప్రయత్నం చేయక పోవడంతో ‘సర్దార్’ పవన్ కు బాలీవుడ్ లో ఒక పీడకలలా మారుతుంది అనే కామెంట్స్ ను కూడ బాలీవుడ్ మీడియా చేస్తోంది. 

అంతేకాదు పవన్ తో ఇంటర్వ్యూలు చేస్తున్న బాలీవుడ్ క్రిటిక్స్ ‘సర్దార్’ సినిమా విషయాల గురించి కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు అతడి వ్యక్తిగత అభిప్రాయాలు కవర్ చేస్తూ ఇంటర్వ్యూలు చేయడం వల్ల ‘సర్దార్’ సినిమాకు వచ్చే ప్రయోజనం ఏమిటి అని బాలీవుడ్ మీడియా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ తన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ను హిందీలో డబ్ చేయడానికి వెనుక పవన్ రాజకీయ ఉద్దేశాలు కూడ ఉన్నాయి అని అంటున్నారు. 

భవిష్యత్ లో పవన్ భారతీయ జనతా పార్టీతో తన ‘జనసేన’ ని అనుసంధానం చేసే ఉద్దేశ్యం ఉండటంతో ఉత్తరాది ప్రాంతానికి చెందిన భారతీయ జనతాపార్టీ నాయకులకుతన స్టామినాను చూపెట్టడానికి పవన్ తన ‘సర్దార్’ ను హిందీలో డబ్ చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఎదిఎలా ఉన్నా పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పలితం బట్టి పవన్ భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలు ఆధారపడి ఉంటాయి అన్నది నిజo..


మరింత సమాచారం తెలుసుకోండి: