సినిమాకు 20 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే పవన్ కళ్యాణ్ నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తాను ప్రతి నెలా తన స్టాఫ్ కు జీతాలు ఇవ్వడానికి కూడ ఇబ్బంది పడటమే కాకుండా తన ఇంటి ఖర్చులకు కూడ చాల ఇబ్బంది పడుతున్నాను అని కామెంట్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అంతేకాదు పవన్ నోటి వెంట ఈ కామెంట్స్ విన్నవారు షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

‘సర్దార్’ విడుదల తరువాత ఊహించని ట్విస్ట్ ఇస్తూ పవన్ నిన్న సాయంత్రం ఛానల్స్ ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాకుండా అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. మరో రెండు మూడు సినిమాల తరువాత తాను సినిమాలలో నటించడం మానివేసినా తన ఖర్చుల కోసం తాను నిర్మాతగా సినిమాలు తీస్తూనే ఉంటాను అని పవన్ తన మనసులో మాట బయట పెట్టాడు.

తన రాబోయే సినిమాల గురించి మాట్లాడుతో దర్శకుడు ఎస్.జె. సూర్య త్రివిక్రమ్ లతో తన సినిమాలు ఉంటాయి అని లీక్స్ ఇస్తూ తాను ఇప్పటికే కొంతమందికి వారి సినిమాలలో నటిస్తానని మాట ఇవ్వడంతో ఈ మూవీ ప్రాజెక్ట్స్ మధ్య తాను టెన్షన్ పడుతున్నాను అంటూ అంతర్లీనంగా దాసరి సినిమా విషయాన్ని కూడ గుర్తుకు చేసాడు పవన్. 

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా గురించి మాట్లాడుతూ ఒక సినిమాను అందరికీ నచ్చే విధంగా తీయడం చాల కష్టమని తన సినిమాలను విమర్శించే వారు ఎంత మంది ఉంటారో పొగిడే వారు కూడ అంతమంది ఉంటారు అని పవన్ అనడం బట్టి ‘సద్దార్’ సినిమా పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానాలు ఇచ్చాడనుకోవాలి. అయితే టాలీవుడ్ ఎంపరర్ స్థాయిలో ఉన్న పవన్ నోటి వెంట పేదరికం మాటలు రావడం ఎవరికీ అర్ధం కాని పజిల్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: