ఈ మద్య తెలంగాణలో అందునా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ పోలీసులు తమ డ్యూటీ చాలా చక్కగా చేస్తున్నారని నిరూపించుకుంటున్నారు..ఇక నందమూరి కుర్రోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాహనానికి బ్లాక్ స్టిక్కర్ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ఆపి రూ.700 ఫైన్ వసూలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఇవాళ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో అటుగా వస్తున్న తారకరత్న కారును ఆపి బ్లాక్ టింట్ గురించి ప్రశ్నించారు.

వెంటనే దానిని తొలగిస్తానని ఆయన వివరణ ఇచ్చిన తర్వాత రూ. 700 రూపాయలు ఫైన్ వేసి పోలీసులు బ్లాక్ టింట్ ను తొలగించారు. ఇర నందమూరి వంశం నుంచి వచ్చిన తారక్ చిత్రాలు ఇప్పటికి చాలా వచ్చాయి కానీ అందులో చెప్పుకోదగ్గ చిత్రాలు ఏవీ లేదు.

త్వరలో తారకరత్న విలన్ గా చేసిన రాజా చెయ్యి వేస్తే మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ అవుతోందని నారా రోహిత్ ప్రకటించాడు. ఈ మూవీపైనే తారకరత్న ఆశలన్నీ ఉన్నాయి. ఇప్పటి వరకు నందమూరి కుర్రాళ్లు నెగిటీవ్ పాత్రలో ఎప్పుడూ కనిపించలేదు ఫస్ట్ టైమ్ తారకరత్న చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: