సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. ఆయన ట్వీట్ లు ఒక్కటి చాలు విపరీతమైన సంచలనం సృష్టించడానికి. పవన్ కళ్యాణ్ మీదా , ఆయన ఫాన్స్ మీదా వర్మ చేస్తున్న ట్వీట్ లు ఎప్పుడూ శ్రుతి మించే ఉంటాయి. ఈ మధ్య కాలం లో తన ట్వీట్ లని కళ్యాణ్ ఫాన్స్ అర్ధం చేసుకోవడం లో ఫెయిల్ అవుతున్నారు అనీ తాను ఒక లాగా చెబుతుంటే మరొక లాగా రియాక్ట్ అవుతున్నారు అనీ అందుకే ఇక పవన్ ఫాన్స్ జోలికి కానీ పవన్ కళ్యాణ్ జోలికి కానీ వెళ్ళను అని చెప్పిన వర్మ మళ్ళీ బ్యాక్ టూ ఫార్మ్ ఒచ్చేసాడు.

 

 

 

మళ్ళీ పవన్ కళ్యాణ్ అభిమానుల మీద నెగెటివ్ ట్వీట్ లు యధావిధి గా పెట్టేస్తున్నాడు వర్మ. అయితే పవన్ ని ఏమీ అనట్లేదు కానీ ఫాన్స్ కి మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు ఈయన.  'ఓ స్టార్ పవర్ ని ఒంటరిగా వదిలేసి జంగిల్ బుక్ ఆడుతున్న థియేటర్స్ లో కూర్చున్నారు ఫ్యాన్స్ అంతా. వాళ్లంతా పవర్ కి వెన్నుపోటు పొడిచేవాళ్లు' అంటూ వర్మ ట్వీట్ చేశాడు.స్పెషల్ గా పవన్ కళ్యాణ్ ని కానీ అతని ఫాన్స్ ని కానీ డైరెక్ట్ గా మెన్షన్ చెయ్యకుండా నే ఈ రకమైన కౌంటర్ లు వేస్తున్నారు వర్మ.

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: