ఎవడితోనైనా పెట్టుకో కాని పోలీసోడితో పెట్టుకోమాకా అన్న మాట తీరున బడా ప్రొడ్యూసర్ ఈరోజున అదే పరిస్థితి ఎదురై నాకెందుకు వచ్చిన గొడవా అని మళ్లీ వెనక్కి తగ్గాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా తేరి తెలుగులో పోలీసోడుగా టైటిల్ పెట్టారు. అయితే పోలీసులను అగౌరవపరచేలా టైటిల్ ఉందని బుధవారం సాయత్రం దిల్ రాజు ఇంటి ముందు పత్రికలు అంటించారు పోలీస్ అధికారులు.


పోలీస్ అధికార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, నగర విభాగం అధ్యక్షుడు ఎన్.శంకర్‌రెడ్డి పోలీసోడు టైటిల్ గురించి ఆరోపణలు చేయగా గురువారం పొద్దున కల్లా ఆ సినిమా టైటిల్ పోలీస్ గా మారుస్తూ పోస్టర్స్ వేయించాడు దిల్ రాజు. బడా ప్రొడ్యూసర్ అయినా సరే పోలీస్ దెబ్బకి దిల్ రాజు కూడా దిగి రాక తప్పలేదు. అయితే సినిమా రిలీజ్ రెండు రోజుల్లో ఉండగా గొడవలకు తావివ్వకుండా సినిమా ప్రశాంతంగా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడు దిల్ రాజు.  


ఇక ఓ పక్క తేరి అంటూ తమిళంలో ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది సినిమా అక్కడ హిట్ టాక్ రావడంతో ఇక్కడ కూడా హిట్ కొడుతుందని ఆశాభావంతో ఉన్నాడు దిల్ రాజు. రాజా రాణి దర్శకుడు అత్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమంత, ఎమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించారు.


జివి ప్రకాశ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా కోలీవుడ్లో కూడా భారీ టికెట్స్ అమ్మాలని థియేటర్ యాజమాన్యం నిన్న సాయంత్రం దాకా గొడవ చేశారు. మళ్లీ ఎలాగోలా అక్కడ పరిస్తితి చక్కబడ్డది అనుకున్న టైంలో తెలుగులో పోలీసోడికి రియల్ పోలీసులు షాక్ ఇచ్చారు. మరి ఇంత కష్టపడి రిలీజ్ చేస్తున్న దిల్ రాజుకి సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: