శివాజీ కెరీర్లో మరో వైవిధ్యభరితమైన చిత్రం రానుంది. అదే గురుడు. వైవిధ్యభరితమైన స్క్రీన్ ప్లేతో శివాజీ కెరీర్లోనే ఓ సరికొత్త కథతో ఈ చిత్రాన్ని నిర్మించామని చెబుతున్నాడు దర్శకుడు కిరణ్,  సీడీ నాగేంద్ర నిర్మిస్తున్న ఈచిత్రంలో రీతై కౌర్ హీరోయిన్. ఇందులో శివాజీ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్నాడు.   ఎవరికైనా ఏ సమస్య వచ్చినా చిటికెలో పరీక్షించేస్తాడు శివాజీ.   అలాంటి శివాజీకి ఓ సమస్య వస్తుంది. దాన్ని పరిష్కరించలేకపోతాడు. ఆ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయాన్ని కొత్త స్క్రీన్ ప్లేతో చెప్పామంటున్నాడు దర్శకుడు. రాజ్ కింగ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని... పెద్ద చిత్రాలు లేని సమయంలో విడుదల చేస్తే కొంతయినా గిట్టు బాటు అవుతుందని జనవరి 25న విడుదల చేస్తున్నారు నిర్మాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: