సెలబ్రిటీ ల మీద ఎప్పుడూ ఎదో ఒక ఆరోపణ, వివాదం రావడం మామూలే. అనేక సందర్భాల్లో వాటిని ఎదురుకొన్న వారు ఉన్నారు. ఇల్లీగల్ అఫైర్ లూ, రాజకీయలాలో కి రావడం , సినిమాల అవకాశాలు లేకపోవడం ఇలాంటి విషయాల్లో అయితే చెప్పనే అక్కరలేదు. అలాగే మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కి కూడా కెరీర్ మొదటి నుంచీ ఎన్నో సవాళ్ళూ ప్రతి సవాళ్ళూ ఎదురు అవుతూ ఒచ్చాయి. సల్మాన్ , ఒబెరాయ్ లతో అఫైర్ ల విషయం లో ఆమె చాలా ఇబ్బందులే పడింది, మీడియా ఆమె గురించి ఎంత నెగెటివ్ గా రాసిందో ఆమె అంతకంత కూ ఎదుగుతూ ఒచ్చింది కూడా. అయితే ఇప్పుడు ఒకే ఒక్క విషయం లో ఐశ్వర్య తప్పు చేస్తోంది ఏమో అన్నట్టుగా ఆమె బిహేవ్ చేస్తోంది.

 

 

 

పనామా పేపర్ల వారు బట్టయబయలు చేసిన లిస్టు లో ఆమెతో పాటు ఆమె మామగారి పేరు కూడా ఉండడం విశేషం. ఈ వ్యవహారం లో బిగ్ బీ కుటుంబం ఆ ఆరోపణలని ఖండిస్తూ భారీ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. తాజాగా మీడియా లో కనిపించిన ఐశ్వర్యారాయ్ పనామా పాపర్స్ వ్యవహారం మీద క్వశ్చన్ చెయ్యగా ఆమెకి ఒళ్ళు మండినట్టు ఉంది. " పత్రికా ప్రకటన విడుదల చేసాం కదా ? అందులో చూసుకోండి " అంటూ విసుగ్గా సమాధానం చెప్పింది ఐశ్వర్య. ఎన్నో సంవత్సరాల నుంచీ ఐశ్వర్యా రాయ్ ని దగ్గర నుంచి చూస్తున్న ఆ రిపోర్టర్ ఆమె సడన్ గా అలా అనేసరికి షాక్ కి గురి అయ్యాడు. పనామా లో నిజంగా ఆమె పేరు , ఆమె ధోరణీ లేకపోతే ఐశ్వర్య ఎందుకు అంత అసహనం ప్రదరిస్తుంది అంటున్నారు మరి కొందరు.


మరింత సమాచారం తెలుసుకోండి: