అల్లుఅరవింద్ వారసుడుగా సినిమాలలోకి వచ్చి అభిమానులకు స్టైలిష్ స్టార్ గా మారి సోషల్ మీడియాలో నిరంతరం సంచలనంగా ఉండే అల్లుఅర్జున్ బాక్స్ ఆఫీసు రేసు గుర్రం లా పరుగెడుదామని తన ‘సరైనోడు’ సినిమా ద్వారా ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి అనేక ఆ శక్తికర విషయాలను షేర్ చేస్తున్నాడు. ఈ సందర్బంలో బన్నీ ఆలోచనలలో ఉన్న భవిష్యత్ ప్రణాళికలు వింటే ఎవరైనా షాక్ అవ్వడం ఖాయం.

తనకు 10 వేల కోట్ల ఆస్తులు ఉన్నా అట్టర్ ఫ్లాప్ హీరోగా సినిమా రంగంలో మిగిలి పోవడం తనకు ఇష్టం లేదని అందుకే తాను నటించే సినిమాలలో అంత కష్ట పడతాను అని అంటున్నాడు. తను నటించే సినిమాలకు సంబంధించి ప్రణాళికలు లేకపోయినా తన జీవితానికి మాత్రం కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అని అంటున్నాడు. దక్షిణాది సినిమా రంగంలో ఒక ఐ కాన్ గా మారిపోవాలని అల్లుఅర్జున్ కోరిక అట. అంతేకాదు ప్రభుత్వం ఏదైనా మంచి గుర్తింపు ఉన్న అవార్డ్ అందుకోవాలని టాలీవుడ్ టాప్ ట్రెండ్ బ్రేకింగ్ సినిమాలలో కనీసం తనవి 5 ఉండాలని కలలు కుంటున్నాడు బన్నీ.

ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇచ్చే వివిధ రకాల పురస్కారాలలో తన సినిమా కూడ ఉండాలని చిరంజీవి పేరు చెపితే గుర్తుకు వచ్చే బ్లడ్ బ్యాంక్ లా ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి ఐక్యరాజ్యసమితి స్థాయిలో గుర్తింపు పొందాలని తన కోరిక అని అంటున్నాడు అల్లుఅర్జున్. తన సినిమాలు నమ్ముకుని ధియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులకు వారి డబ్బును వారి కాలాన్ని వృథచేసే సినిమాలలో నటించడం తన దృష్టిలో నేరం అని అంటున్నాడు బన్నీ.

టెర్రరిజమ్ – రేప్  లాంటి  విషయాలు ఈమధ్య తనను బాగా కలవర పెడుతున్నాయని వాటికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమాలు చేయాలని ఉంది అని అంటూ అల్లుఅర్జున్ తన షాకింగ్ నిర్ణయాలను బయట పెట్టాడు. మరి అల్లుఆర్జున్ ధృఢమైన నిర్ణయాలలో ఎన్ని నెరవేర్చగలడో రానున్న రోజులలో తెలుస్తుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: