తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కొరియోగ్రఫర్ గా పనిచేసిన మాస్టర్ రఘు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన కొరియోగ్రఫి చేసిన  యమదొంగ, రామదాసు, లయన్, హ్యాపీడేస్ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఎన్నో చిత్రాలకు తన మధురమైన గానాన్ని అందించిన ప్రణవిని రఘు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

అల్లు అర్జున్ తో రఘు మాస్టర్


ఈ విషయాన్ని ఆమద్య ఓ ఆడియో ఫంక్షన్లో బయటకు చెప్పారు. తర్వాత పెద్దల అంగీకారంతో గతేడాది డిసెంబర్ 26 వ తేదీన నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే.  కాగా వీరి పెళ్లి ఈ నెల 21 న జరగబోతున్నట్లు రఘ స్వయంగా తన ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. ఈ వివాహానికి బుల్లితెర, వెండి తెర సెలబ్రెటీలు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది.


రఘు,ప్రణవి నిశ్చితార్థం


ఈ సందర్భంగా తమ వివాహానికి వచ్చి నూతన దంపతులను ఆశిర్వదించాలని కొరియోగ్రాఫర్ రఘు తెలియజేశారు. తెలుగు ఇండస్ట్రీకి అల్లు అర్జున్ ఆర్యా 2 చిత్రానికి కొరియోగ్రఫీ అందించి మంచి సక్సెస్ ఫుల్ కొరియోగ్రఫర్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతే కాదు బుల్లి తెరపై కొన్ని డ్యాన్స్ షోలకులకు జడ్జీగా కూడా వ్యవహరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: