తెలుగు చిత్రసీమలో అలనాటి అందాల తార ఎన్టీఆర, ఏఎన్ఆర్ లతో కలిసిన నటించిన నటీమణి కేఆర్ విజయ అంటే తెలియన వారు ఉండరు. తర్వాత కాలంలో తల్లి పాత్రలు, దేవతల పాత్రలు వేస్తూ వచ్చారు. గత కొంత కాలంగా ఆమె చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.  తాజాగా  కెఆర్ విజయ కూతురు హేమలత(47) ఆకతాయి నుంచి వేధింపులు రావడంతో విషయం పోలీస్ స్టేషన్ కి చేరింది.  కే ఆర్ విజయ కూతురు హేమలత(47) గత కొంత కాలంగా భర్తతే బేధాభిప్రాయాలు రావడంతో కూతుళ్ళతో కలిసి ఒంటరిగా జీవనం సాగిస్తుంది.

అయితే కూతుళ్ళిద్దరు స్టడీస్ నిమిత్తం ఫారెన్ వెళ్ళడంతో హేమలత కొంత కాలంగా ఒంటరిగానే ఉంటుంది.   హేమలత(47) ఒంటరిగా ఉంటున్న విషయం తెలుసుకున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కదిరవేల్ ఓ ప్లేస్ గురించి హేమలత ఇంటికి వచ్చి కొన్ని వివరాలు మాట్లాడాలని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తర్వాత ఆమెకు పదే పదే ఫోన్ చేస్తూ తరచూ మెసేజ్‌లు పంపుతూ ఆమెని చాలా ఇబ్బంది పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

నువ్వు ఒంటరిగా ఉంటున్నావని నేను నిన్ను వివాహం చేసుకుంటానంటూ ఫోన్లు , మెసేజ్ లు పెట్టడం ఆరంభించాడు. అజ్ఞాత వ్యక్తి టార్చర్ ని భరించలేని హేమలత కోయంబత్తూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి నాకు ఆల్రెడి పెళ్ళి కాగా నువ్వు ఒప్పుకుంటే నా భార్యకు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్ళి చేసుకుంటానంటూ వేధించడంతో హేమలత పోలీసులను ఆశ్రయించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: