ఈ మధ్య కాలంలో సినిమాల హీరో హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ పై కూడ విపరీతంగా ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. కొందరు టాప్ హీరోలు టాప్ హీరోయిన్స్ అయితే తమ కాస్ట్యూమ్స్ సెలక్షన్స్ కోసం తమ డిజైనర్లను వెంట పెట్టుకుని విదేశాలకు వెళ్ళి అక్కడి మోడల్స్ స్టడీ చేసి మరీ వస్తున్నారు. అయితే టివి 9 మధురా శ్రీధర్ సంయుక్తంగానిర్మిస్తున్న ‘ఒకమనసు’ సినిమా కోసం ఆ సినిమా హీరో హీరోయిన్స్ నాగశౌర్య నిహారికల కాస్ట్యూమ్స్ పై చాల వెరైటీగా ఖర్చు పెట్టారు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఈ సినిమాలో కథను బట్టి హీరో నాగశౌర్య ఏకంగా 110 షర్టులు వేసుకున్నాడట. దీనికోసం నిర్మాత మధురా శ్రీధర్ కాస్ట్ కంట్రోల్ కోసం ఒక కాటన్ క్లాత్ ను హోల్ సేల్ గా తీసుకుని వాటికి డిఫరెంట్ కలర్స్ డైయింగ్ చేయించేసి, రకరకాల పాట్రన్ ల్లో కుట్టించాడట. దీనితో ఒక షర్ట్ కు ఆరేడు వందలు ఖర్చుతో నాగశౌర్య కలర్ ఫుల్ గా కనిపించడానికి రకరకాల షర్ట్స్ తయారు అయ్యాయి అని టాక్.

ఇక నిహారిక విషయంలో కూడ ఈసినిమా నిర్మాత దాదాపు 100 డ్రెస్ లను రకరకాలుగా డిజైన్ చేయించి నిహారికను అందంగా చూపించాడట మధురా శ్రీధర్. ఇది ఇలా ఉండగా ఈసినిమా షూటింగ్ పూర్తి అయి విడుదలకు రెడీ అవుతున్న నేపధ్యంలో ప్రస్తుతం పని లేకుండా ఖాళీగా పడి ఉన్న ఈ రెండు వందల పది డ్రెస్ లను ఫంక్షన్ లో వేలం వేసి, ఆ వచ్చిన ఆదాయాన్ని ఏదైనా ఛారిటీ సంస్థకు ఇవ్వాలని నిర్మాత మధుర శ్రీధర్ ఆలోచన చేస్తున్నాడు అని ఫిలింనగర్ టాక్. 

ఈ వార్తలు ఇలా ఉండగా ఈనెలలో జరగవలసిన ఈసినిమా ఆడియో ఫంక్షన్ ను ఎటువంటి కారణాలు చెప్పకుండా ఈ సినిమా నిర్మాతలు వాయిదా వేయడం చాల మందిని ఆశ్చర్యపరుస్తోంది. దీనితో మే నెలలో విడుదల అవుతుంది అనుకున్న ఈ సినిమా ఇప్పట్లో విడుదల లేదా అనే అనుమానాలు కూడ వ్యక్తం అవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: