నిన్న బెంగుళూర్ లో అల్లుఅర్జున్ తన ‘సరైనోడు’ సినిమాను ప్రమోట్ చేస్తూ నిర్వహించిన మీడియా మీట్ లో బన్నీ ప్రవర్తించిన తీరుకు కన్నడ మీడియా షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అల్లుఅర్జున్ చాల వ్యూహాత్మకంగా దక్షిణాది సినిమా రంగంలో తన మార్కెట్ ను పెంచుకోవడానికి ఈ మీడియా మీట్ ను చాల తెలివిగా ఉపయోగించుకున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మీడియా మీట్ లో బన్నీ కన్నడంలో మాట్లాడి కన్నడ మీడియా అభిమానాన్ని పొందాడు. 

అల్లుఅర్జున్ అనర్గళంగా ఈ మీడియా మీట్ లో కన్నడ భాషలో మాట్లాడడంతో... అభిమానులు విజిల్స్, కేరింతలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. కిక్కిరిసిన అభిమానుల సమక్షంలో అల్లుఅర్జున్ నిర్వహించిన ఈ మీడియా మీట్ లో బన్నీ ప్రవర్తనను పరిశీలించిన విశ్లేషకులు కన్నడ మార్కెట్ పై అల్లుఅర్జున్ చాల పెద్ద ఎత్తుగడలోనే ఉన్నాడు అని కామెంట్ చేసినట్లు టాక్. అంతేకాదు ఎవరైనా కన్నడ దర్శకుడు మంచి స్క్రిప్ట్ తో తన వద్దకు వస్తే తాను రాజ్ కుమార్ ఫ్యామిలీ హీరోలతో కలిసి నటించాలని ఉంది అని సంకేతాలు ఇస్తూ కన్నడ ప్రేక్షకులకు మరిoత దగ్గర అవ్వడానికి ప్రయత్నించాడు అల్లుఅర్జున్. 

కర్ణాటకలో బన్నీ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ 5.80 కోట్లు ‘రేసుగుర్రం’ 5.20 కోట్ల రూపాయల భారీ కలక్షన్స్ ను వసూలు చేసిన నేపధ్యంలో ఈ ‘సరైనోడు’ ద్వారా మరింత భారీ కలక్షన్స్ వసూలు చేసి కన్నడ మార్కెట్ లో కూడ తన ఇమేజ్ ను పెంచుకోవడానికి చాల తెలివిగా అడుగులు వేస్తున్నాడు అనుకోవాలి. బన్నీ క్రేజ్ పై ఉన్న నమ్మకంతో ‘సరైనోడు’ కర్నాటక డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం 9 కోట్లను చెల్లించారు అంటే కన్నడ మార్కెట్ లో బన్నీ స్టామినా ఏమిటో అర్ధం అవుతోంది. 

ఇదే సందర్భంలో కన్నడ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తాను చేయబోయే కొత్త సినిమాలు గురించి కూడ లీకులు ఇచ్చాడు బన్నీ. తన నెక్స్ట్ మూవీ రెండు భాషల్లో నిర్మింప బడుతుందని చెపుతూ దర్శకుడు ఎవ్వరూ అన్న విషయమై త్వరలో చెపుతాను అని అన్నాడు ఈ అల్లువారి అబ్బాయి. ఇప్పటికే కోలీవుడ్ టాప్ డైరక్టర్స్  విక్రమ్ కుమార్, లింగుస్వామిలు ఇద్దరూ కూడా బన్నీతో సినిమా చేయాలని ఆశపడుతున్న నేపధ్యంలో వీరిద్దరి మధ్యా తన సినిమా ఉండబోతోంది అన్న సంకేతాలు ఇచ్చాడు.  ఏది ఏమైనా ‘సరైనోడు’ ఫలితం బట్టి అల్లుఅర్జున్ టాలీవుడ్ టాప్ 3 హీరోలలో స్థానం సంపాదిస్తాడా ? లేదా అన్న విషయం మరో కొన్ని గంటలలో తేలిపోతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: