ఒక డైరెక్టర్ ఒక హీరో మీద ఆశలు పెట్టుకోవడం తమతో సినిమా తీస్తారు అని నమ్మడం మామూలు విషయమే కానీ ఈ కేసు లో రాం చరణ్ మీద ఏకంగా ఒక డైరెక్టర్, ఒక నిర్మాత ఆశలు పెట్టేసుకున్నారు. తనీ ఒరువన్ సినిమా రిమేక్ ని తెలుగు లో నిజానికి డీవీవీ దానయ్య తో చెయ్యాల్సి ఉంది చరణ్. ఆ సినిమా హక్కులు కొన్నది కూడా దానయ్యే కానీ అల్లూ అరవింద్ కోరడం తో ఈ సినిమాని ఇప్పుడు గీతా ఆర్ట్స్ మీద తీస్తున్నారు. ఆ సమయం లో ఆ హక్కులు ఇచ్చినందుకు గాను డీవీవీ దానయ్య తో ఒక సినిమా కి ఓకే అన్నాడు చరణ్. మరొక పక్క బెంగాల్ టైగర్ హిట్ కొట్టిన తరవాత చరణ్ కి ఒక లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడు సంపత్ నంది. తనీ ఒరువన్ షూటింగ్ అవ్వగానే తదుపరి చిత్రం తమకి ఇస్తారు అనే దానయ్యా, సంపత్ లు ఆశగా ఎదురు చూస్తున్నారు.




కానీ చరణ్ తరవాత సినిమా మైత్రీ వారికి సంతకం పెట్టి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు అని టాక్ నడుస్తోంది. అంతే కాకుండా చరణ్ ఈ సినిమా సుకుమార్ తో చేస్తాడు అంటున్నారు. ఈ చిత్రం తరవాత అయినా చూసుకుందాం అంటే యూవీ క్రియేషన్స్ - మారుతి కాంబినేషన్ లో కూడా ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ తనీ ఒరువన్ అయ్యాక లేదా ఆ సినిమా షూటింగ్ లో ఉండగా చరణ్ ఏరకమైన నిర్ణయం తీసుకుంటాడో అని ఎదురు చూస్తున్నారు వారిద్దరూ, అయితే ఫిలిం నగర్ సమాచారం ప్రకారం చరణ్ వారిద్దరికీ భారీగా హ్యాండ్ ఇచ్చినట్టే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: