ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఓ వైపు స్టార్ హీరోయిన్స్ అంతా కలిసి ఒకే మూవీలో నటించటానికి సిద్ధపడుతున్నప్పటికీ…ఎవరికి వారే సొంతంగా ఆఫర్స్ ని చేజిక్కించేకునేందుకు సైతం ఎన్నో రకాల లాభీయింగ్ లను చేస్తున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లో ఎక్కవుగా పోటీని ఎదుర్కుంటున్న హీరోయిన్స్ వచ్చేసి సమంత, శ్రుతిహాసన్ మాత్రమే.


వీరిద్దరి మధ్య గత రెండు  సంవత్సరాల నుండి భారీ పోటీ జరుగుతుంది. టాప్ హీరోలు అంతా సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయితే, ఈ విషంయం తెలుసుకున్న శ్రుతిహాసన్…సమంత ఆఫర్స్ ని ఏ విధంగా చేజిక్కించుకోవాలి అన్న విధంగా మంతనాలు జరిపేది. సమంత సైతం శ్రుతిహాసన్ విషయంలో ఈ విధంగానే  ట్రిక్స్ ని ప్లే చేసేదని అంటున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా శ్రుతిహాసన్ కి సంబంధించిన 3 క్రేజీ ఆఫర్స్ ని సమంత చేజిక్కించుకుందని అంటున్నారు.


సూర్య, విజయ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా ప్యూచర్ ప్రాజెక్ట్స్ లో కమిట్మెంట్స్ పూర్తయ్యాయి. అయితే చివరి నిముషంలో ఏం జరిగిందో తెలియదు కానీ, ఆ డైరెక్టర్స్ శ్రుతిహాసన్ ని రీప్లేస్ చేసి…సమంతని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇది సమంత చేసిన గ్రౌండ్ వర్క్ అని శ్రుతిహాసన్ ని బాగా తెలుసంట.


అందుకే శ్రుతిహాసన్ ప్రస్తుతం సమంత కి దక్కుతున్న ఆఫర్స్ వివరాలను తెలుసుకునే ప్రయత్నాలను చేస్తుంది. సమంత చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ని ఎలాగైనా తాను దక్కించుకునేలా ప్రయత్నాలను చేస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే…ఈ ఇద్దరి హీరోయిన్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: