కుర్రకారుని తన మత్తులో ముంచి తలమునకలయ్యేలా చేసిన హాట్ గాళ్ టబు మొన్నటిదాకా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ముందు టాలీవుడ్లో సూపర్ క్రేజ్ సంపాదించి ఆ తర్వాత బీ టౌన్ బాట పట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు మరళ టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతుంది. అయితే 8 ఏళ్ల క్రితం పాడురంగడు సినిమాలో తన అందాలతో అలరించిన టబు తెలుగులో ఏ సినిమా చేయబోతుంది అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..


తెలుగులో హాట్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన టబు మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తుంది. చివరగా పాండురంగడు సినిమాలో నటించిన టబు అందులో కూడా తన అంద చందాలతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. అయితే ఆ తర్వాత 8 ఏళ్లుగా తెలుగులో నటించని టబు తెలుగులో అనుష్క భాగమతిలో నటించేందుకు రెడీ అయ్యింది.


పిల్ల జమిందార్ అశోక్ డైరెక్ట్ చేస్తున్న భాగమతిలో అనుష్క లీడ్ రోల్ చేస్తుంది. అయితే సినిమాలో టబు నటిస్తున్న రోల్ ఇంకా ఏంటన్నది తెలియలేదు. జూన్ మొదటి వారంలో మొదలవ్వబోతున్న ఈ సినిమాలో టబు కూడా జాయిన్ అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో మదర్ క్యారక్టర్ వేస్తున్న టబు రీసెంట్ గా ఫితూర్, హైదర్ సినిమాల్లో నటించింది.
మరి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న టబు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. తెలుగు ప్రేక్షకులను బొత్తిగా మర్చిపోయిన టబు మరోసారి తన అభిమానులను ఈ సినిమాతో అలరించనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: