చిరంజీవి 150వ సినిమా బాలకృష్ణ 100వ సినిమా పట్టాలు ఎక్కి పరుగులు తీస్తూ ఉంటే ఈసినిమాల విడుదల కోసం చిరంజీవి బాలకృష్ణల అభిమానులతో పాటుగా టాలీవుడ్ సినిమా రంగం కూడ చాల ఆశక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఈలిస్టులోకి విక్టరీ వెంకటేష్ చేరబోతున్నాడు. అయితే వెంకటేష్ మైలురాయి మాత్రం 75వ సినిమా.

దాదాపు మూడు దశాబ్దాలుగా ఎన్నో హిట్ సినిమాలలో నటించి అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన వెంకటేష్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో నటిస్తున్న ‘బాబు బంగారం’ సినిమా వెంకీ కెరియర్ కు సంబంధించి 73వ నెంబర్. ఇప్పటికే ఈసినిమా విడుదల కావలసి ఉన్నా నయన తార టార్చర్ వల్ల ఈసినిమా నిర్మాణం ఆలస్యం అవుతోంది. దీనితో ఈసినిమాను ఏదోవిధంగా పూర్తిచేసి జూలైలో విడుదల చేయాలని వెంకటేష్ భావిస్తున్నాడు.

ఈసినిమా పూర్తి అయిన వెంటనే దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో వెంకటేష్ మరో సినిమాను ప్రారంభించి అన్నీ కుదిరితే ఈ సంవత్సరాంతానికి విడుదల చేయాలి అన్న ఊద్దేశ్యంతొ ఉన్నాడు. అయితే ఈ సినిమా ఇంకా ప్రాంభించకుండానే వెంకటేష్ తన 75వ సినిమా స్క్రిప్ట్ విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అని టాక్. చిరంజీవికి బాలకృష్ణకి వారి ఇమేజ్ ని పెంచేవిధంగా వారు నటిస్తున్న ‘కత్తిలాంటోడు’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మారుతున్న నేపధ్యంలో అటువంటి ఒక పవర్ ఫుల్ కథలో వెంకటేష్ నటించాలని ఆరాట పడుతున్నట్లు టాక్. 

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కళ్యాణ్ రామ్ తో ఒక సినిమాను చేస్తున్న నేపధ్యంలో ఆ సినిమా పూర్తి అయిన వెంటనే పూరి దర్శకత్వంలో తన 75వ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడ వెంకటేష్ కు ఉన్నట్లు తెలుస్తోంది. అది కుదరకపోతే తన అన్న కొడుకు రానా తో ఒక పవర్ ఫుల్ స్టోరీలో మల్టీ స్టారర్ గా తన 75వ సినిమాను మారిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడ వెంకటేష్ కు ఉంది అని అంటున్నారు. ఏమైనా వచ్చే సంవత్సరం మీడియాకు వెంకటేష్ 75వ సినిమా వార్తలు కూడ హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: