ఈనెల 20న విడుదలకావడమే ప్రధాన టార్గెట్ గా పరుగులు తీస్తున్న ‘బ్రహ్మోత్సవం’ కు మణి శర్మ షాక్ తగిలినట్లు గా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి పాటలు మిక్కీ జే మేయర్  ట్యూన్ చేసినా. బ్యాగ్రౌండ్ స్కోర్  మాత్రం మణి శర్మ ఇస్తున్నాడు అని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. 

అయితే ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా నుండి మణి శర్మను తప్పించి  ‘ఊపిరి’ సినిమాకు సంగీత దర్శకుడుగా పని చేసిన గోపీ సుందర్ చేత ఈసినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నట్లు టాక్. దీనికి కారణం మణి శర్మ ఈసినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అనుకున్న వేగాన్ని అందివ్వలేక పోవడమే అని అంటున్నారు. 

అదీ కాకుండా గోపీ సుందర్ ‘ఊపిరి’ సినిమాకు అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మహేష్ కు బాగా నచ్చడంతో ఈ మార్పు జరిగింది అని టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాను భారీ మొత్తాలకు కొనుక్కున్న ఓవర్సీస్ బయ్యర్లు ఈసినిమా సెన్సార్ సర్టిఫికేట్ ను కంటెంట్ ను 15వ తారీఖునాటికి అమెరికాకు చేరే విధంగా షిప్పింగ్ చేయకపోతే అక్కడ ప్రీమియర్ షోల ఏర్పాట్లకు చాల అడ్డంకులు ఏర్పడతాయని ఈసినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు పివిపి సంస్థ పై విపరీతమైన ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. 

దీనితో మహేష్ రంగంలోకి దిగి ‘బ్రహ్మోత్సవం’ పనుల వేగాన్ని పెంచినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు మహేష్ పలు మీడియా సంస్థలకు అదేవిధంగా అనేక ఛానల్స్ కు ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం తన ఇంటర్వ్యూలను ఈ నెల 14వ తారీఖు నుండి రికార్డు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్ అంతా మహేష్ ఇంటర్వ్యూలతో ఛానల్స్ మరియు పత్రికలు ‘బ్రహ్మోత్సవo’ సంబరాలను భారీ స్థాయిలో నిర్వహించబోతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: