తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం అంటే తమిళ తంబీలకు పండుగ వాతావరణమే. రజినీ సినిమా వస్తుందటే వారం రోజుల నుంచి థియేటర్ల వద్ద పెద్ద హంగామా నెలకొంటుంది. ఇక సినిమా రిలీజ్ రోజు స్వీట్లు పంపకం, కటౌట్స్ కి పాలాభిషేకాలతో చాలా కోలాహలంగా ఉంటుంది.  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మాఫియా నేపధ్యంతో కబాలి అనే సినిమా చేస్తోండగా ఈ చిత్రానికి పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి టీజర్  రికార్డుల మోత మోగించింది. వాస్తవానికి ఈ చిత్రం ఆడియో వేడుక పై రక రకాల వార్తలు వచ్చాయి..ఏప్రిల్ నెలలోనే ఆడియో రిలీజ్ చేయాని చూశారు కానీ అది వాయిదా పడింది.

కబాలి లో రజినీకాంత్


ఇక ఈ చిత్రం ఆడియో రిలీజ్ జూలై మొదటి వారంలో చేయాలని చూసినా  అదికూడా మర్చి ఈ నెల 30 వ తారీఖు తమిళ మరియు తెలుగు వర్షన్ లో ఒకేరోజు విడుదల చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక తమిళ వర్షన్ ఉదయం నిర్వహించి తెలుగు వర్షన్ ఆడియో సాయంత్రం నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఆ మద్య ఈ చిత్రం ఆడియో వేడుక మలేషియాలో ఉండబోతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి..వీటన్నిటికి తెరపడుతూ ఈ నెల 30 న కబాలి ఆడియో డేట్ కన్ఫార్స్ చేసినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.

కబాలి షూటింగ్ స్పాట్ లో రజినీకాంత్


ఇక తెలుగు పంపిణీ హక్కులు భారీ ధరకు అభిషేక్ పిక్చర్స్ సొంతం జరిగినది. అభిషేక్ పిక్చర్స్ ఆంధ్ర నైజాం ఏరియా హక్కులను కైవసం చేసుకుంది. ఎన్ వి. ప్రసాద్ సీడెడ్ హక్కులు పొందారు. కబాలిలో అండర్ వరల్డ్ డాన్ గా రజనీ నటిస్తుండగా, ఆయన సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా చేస్తుంది. ధన్సికా, కలైరాజన్‌, దినేశ్, నాజర్ తదితరులు మిగతా పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: