తెలుగు ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు వారసులుగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. విభిన్నమైన చిత్రాల్లో నటించి మాస్, ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక ఎన్టీఆర్ మనవడు నందమూరి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా సినరంగ ప్రవేశం చేశారు. తర్వాత స్టూడెంట్ నెం.1 చిత్రంతో హీరోటా పరిచయం అయ్యారు. ఎన్టీఆర్ వచ్చిన కొత్తలో బొద్దుగా ఉండేవారు కానీ డ్యాన్స్, యాక్షన్ పరంగా మాత్రం మంచి మార్కులే కొట్టేశారు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘యమదొంగ’ చిత్రంలో సన్నగా కరెంటు తీగలా మారిపోయారు.  


లక్ష్మీ ప్రణితతో ఎన్టీఆర్


తాజాగా ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన రేంజ్ రోవర్ కారును అమ్మేయబోతున్నాడట ఇది వింటే మీకు కాస్త ఆశ్చర్యం కలుగుతుంది..కానీ ఇది నిజం. ప్రస్తుతం ఎన్టీఆర్ మంచి రేంజ్ లో ఉన్నారు కదా మరి ఆయనకు కారు అమ్మాల్సిన అవసరం ఏంటబ్బా అనుకునే వారికి అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. స్వతహాగా ఎన్టీఆర్ కి కార్లు అంటే చాలా పిచ్చట..అంతే కాదు ఫ్యాన్సీ నెంబర్ అన్నా కూడా చాలా ఇష్టమట. లక్ష్మీప్రణిత తో 2011లో పెళ్లి అయిన‌ప్ప‌టి నుండి ఎన్టీఆర్ రేంజ్ రోవర్ కారు కొన్నారు...అప్పటి నుంచి ఆ కారునే వాడుతున్నారు.

కొడుకు అభయ్ రామ్ ఎన్టీఆర్


ఎక్కడికి వెళ్లినా ఆయన అదే కారులో ప్రయాణిస్తున్నారట..కానీ గత కొంత కాలంగా  ఆ కారు  ప్రయాణించడం తనకు అస్సలు కలిసి రావడం లేదని నిర్ణయాని వచ్చాడు..దీంతో  దానిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడ‌ట‌.   ప్రస్తుతం దాన్ని పూర్తిగా గ్యారేజ్ కు పరిమితం చేసి తను మరో కొత్త కారు బీఎమ్‌డబ్ల్యూ కొనుక్కుని దానిలోనే తిరుగుతున్నాడు. ఇక గ్యారేజ్ లో కారు ఉంచి ఏంలాభం అంతే కాదు ఆ కారంటే పూర్తి అయిష్టంగా ఉన్న ఎన్టీఆర్ దాన్ని అమ్మేయాలని చూస్తున్నారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: