మెగాస్టార్ చిరంజీవి సోలో హీరోగా చాలా కాలం తర్వాత చేస్తున్న సినిమాకు అంతా రంగం సిద్ధమైంది. రీసెంట్ గా ముహుర్తం కూడా పెట్టుకున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే సినిమాలో నటించే నటీనటు ఎంపిక జరుగుతున్న ఈ తరుణంలో మెగాస్టార్ పక్కన జతకట్టే సుందరీమణులు ఎవరా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 


ఇక ఓ పక్క హీరోయిన్ ఎవరన్నది డిసైడ్ కాలేదు అని చెబుతున్నా.. చిరు పక్కన అనుష్క ఖాయమంటున్నారు. అయితే అనుష్క మెయిన్ లీడ్ కాగా చిరు సినిమాలో మరో హాట్ బ్యూటీ కూడా చిందులేస్తుందట. అదెవరో కాదు సరైనోడుతో సరిగ్గా మూడు సినిమాల్లో నటించిన కేథరిన్ థ్రేసా.   


బన్నితో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కేథరిన్ కు లక్కీ ఛాన్స్ తగిలిందని ఫిల్మ్ నగర్ టాక్. రీసెంట్ గా సరైనోడు సినిమాలో ఆమె చేసిన ఎమ్మెల్యే పాత్ర ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఎలాగు మెగా క్యాంప్ కు అలవాటు పడ్డది కనుక కేథరిన్ తో ఓ మాంచి ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు వినాయక్. 


మరి కేవలం బన్ని సినిమాల్లోనే నటిస్తున్న కేథరిన్ కు ఈ మెగా ఆఫర్ పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు. మెగాస్టార్ సినిమా అంటే చాలు పారితోషికం గురించి ఆలోచించకుండా చేస్తాం అని చెప్పే భామలుంటే మెగా దర్శక నిర్మాతలు మాత్రం కేథరిన్ కే ఓటేయడం ఆమె అదృష్టం. మరి ఈ ఆఫర్ గురించిన అఫిషియల్ డీటేల్స్ త్వరలో వెళ్లడవుతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: