పివిపి అతి తక్కువ కాలంలోనే భారీ సినిమాలను తీసిన పెద్ద నిర్మాణ సంస్థ. అయితే చేసిన సినిమాల్లో హిట్లు కేవలం రెండంటే రెండే ఉన్న పివిపి బ్యానర్ ఫ్లాపుల దెబ్బకి ఇక సినిమాలు తీయడం మానేస్తున్నాడని టాక్. అయితే దీనికి తను ఎంచుకున్న దర్శకులే కారణమని కొందరితో చెబుతున్నాడట పరం వి పొట్లూరి.


సినిమా దర్శకులు తన మాట వినకుండా చేయబట్టే సినిమా బడ్జెట్ తడిసి మోపెడవుతుందట.. రీసెంట్ రిలీజ్ బ్రహ్మోత్సవం కూడా శ్రీకాంత్ అడ్డాల ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెంచేశాడని.. అసలు ఏ నిర్ణయం అయినా సొంతంగా తీసుకున్నాడే తప్ప తనను అడిగి చేయలేదని అంటున్నాడట. అంతేకాదు అందరు హిట్ అనుకున్న ఊపిరి సినిమా కూడా పెద్దగా లాభాలేమి తెచ్చి పెట్టలేదు.


దానికి కారణం కూడా దర్శకుడికి తనకు మధ్య అంత సాన్నిహిత్యం లేకపోవడమే అట. అయితే ఈ గోలంతా ఎందుకని పివిపి ఇక సినిమాలకు ఫైనాన్స్ చేసే ఆలోచనలో ఉన్నాడట. సినిమాలను నిర్మించడం మానేసి ఇక పూర్తిగా వాటికి ఫైనాన్సర్ గా ఉండాలన్నది పివిపి నిర్ణయించుకున్నాడు. మరి స్టార్ హీరోల సినిమాలు హిట్ కొడితే ఎన్ని లాభాలొస్తాయో ఫ్లాప్ అయితే అంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.


అయితే పివిపి లాంటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ చాలా తక్కువమంది ఉంటారు. మరి ఆయన లాంటి నిర్మాత ఇక సినిమాలను తీయడం మానేస్తే మంచి సినిమాలను మిస్ అయినట్టే. కేవలం బ్రహ్మోత్సవం పోయినంతమాత్రానా ఆయన ఇలాంటి డెశిషన్ తీసుకోవడం ఎంత వరకు సమంజసమో ఆయనకే తెలియాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: