ఓ పక్క నిర్మాతగా ఉంటూనే మరో పక్క డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఓ రేంజ్ లోకి వెళ్లాడు. అయితే ఈ మధ్య దిల్ రాజు పెద్ద హీరోల సినిమాలను చేయకుండా కేవలం యూత్ హీరోలతో సినిమాలు చేస్తుండటం విశేషం. పెద్ద సినిమాలను తీయడం కన్న వాటిని డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే మంచిదనే ఆలోచనతో దిల్ రాజు కొత్త ప్లాన్ వేశాడు.


ఇక ఇప్పటికే సాయి ధరం తేజ్ తో రెండు సినిమాలు చేసి హిట్ అందుకున్న దిల్ రాజు, శర్వానంద్ తో ఒకటి, వరున్ తేజ్ తో మరోటి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు నాచురల్ స్టార్ నానితో కూడా ఓ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట దిల్ రాజు. ఇప్పుడు యువ హీరోల్లో నాని జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 


క్రిష్ణగాడి వీర ప్రేమగాథ లో నాని :


హ్యాట్రిక్ హిట్ తో జోరు మీదున్న నాని ప్రస్తుతం జెంటిల్ మన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాని మార్కెట్ లాస్ట్ మూడు సినిమాలతో బాగా పెరిగింది. స్టార్ హీరోలకే ఓ మంచి మార్కెట్ ఉండే ఓవర్సీస్ లో కూడా నానికి కొంత మార్కెట్ వచ్చింది. భలే భలే మగాడివోయ్ సినిమా వసూళు చేసిన రికార్డు కలక్షన్స్ ఓవర్సీస్ లో నాని మార్కెట్ ను అద్దం పడుతున్నాయి.


అందుకే దిల్ రాజు నానితో ఓ మీడియం బడ్జెట్ సినిమా తీసి హిట్ అందుకోవాలనుకుంటున్నాడు. అంతేకాదు ఓవర్సీస్ లో కూడా ఈ మధ్య డిస్ట్రిబ్యూషన్ చేసే ఆలోచనతో పరుగులు తీస్తున్నాడట దిల్ రాజు. మరి దిల్ రాజు చేస్తున్న ఆలోచనలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ప్రస్తుతానికైతే సాయి ధరం తేజ్ తో తీసిన సుప్రీం మంచి లాభాలు తేవడంతో భలే ఖుషిగా ఉన్నాడు ఈ నిర్మాత.


మరింత సమాచారం తెలుసుకోండి: